https://oktelugu.com/

నిహారికతో చిరంజీవి.. నాగబాబు హాట్ కామెంట్స్ !

మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి  సందడి మొదలైంది. జొన్నలగడ్డ నాగ చైత్యనతో నిహారిక వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లో జరగనుంది. ఈ వేడుకకు వేదికగా ప్రముఖ హోటల్ ఉదయ్ పూర్ ప్యాలస్ ని ఎంపిక చేశారు. కొత్త పెళ్లి కూతురు నిహారిక హద్దులు లేని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికి చైతన్యను నిహారిక ఎంతో ఇష్టపడుతున్నారని అర్థం అవుతుంది.  నిహారిక నిన్న తన తల్లి  పద్మజ 32ఏళ్ల క్రితం నిశ్చితార్ధ వేడుకలో ధరించిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 / 01:23 PM IST
    Follow us on

    మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి  సందడి మొదలైంది. జొన్నలగడ్డ నాగ చైత్యనతో నిహారిక వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లో జరగనుంది. ఈ వేడుకకు వేదికగా ప్రముఖ హోటల్ ఉదయ్ పూర్ ప్యాలస్ ని ఎంపిక చేశారు. కొత్త పెళ్లి కూతురు నిహారిక హద్దులు లేని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికి చైతన్యను నిహారిక ఎంతో ఇష్టపడుతున్నారని అర్థం అవుతుంది.  నిహారిక నిన్న తన తల్లి  పద్మజ 32ఏళ్ల క్రితం నిశ్చితార్ధ వేడుకలో ధరించిన చీరను కట్టుకున్నారు. నీలి రంగు వర్ణం కలిగిన ఆ చీరలో నిహారిక మరింత అందంగా ఉన్నారు.

    Also Read: పవన్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ ఎప్పుడంటే !
    నిహారిక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త పెళ్లి కూతురితో ఆప్యాయంగా గడిపారు. చిరంజీవి, నిహారిక కలిసి సెల్ఫీ దిగడం జరిగింది. ఈ ఫోటోపై నిహారిక తండ్రి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆ ఫొటో పోస్ట్ చేసిన నాగబాబు ఓ ఎమోషనల్ కామెంట్ పెట్టారు. ‘ ఆయన ప్రేమ…సమయం, వయసు అనే ఎల్లలు లేనిది. ఆయన చిరు నవ్వు ప్రతి సందర్భాన్ని వేడుకలా మారుస్తుంది, పెళ్లి కూతరు నిహారికకు ఇది అరుదైన క్షణం’ అని ఓ నోట్ పెట్టాడు. అన్న చిరంజీవిపై నాగబాబుకు ఉన్న ప్రేమా, గౌరవం ఈ పోస్ట్ ద్వారా అర్థం అవుతుంది.

    Also Read: పెళ్లి కుమార్తెగా నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు !
    మరో వైపు నిహారిక కోసం కోటి రూపాయలకు పైగా ఖరీదైన బహుమతిని  చిరంజీవి సిద్ధం చేశారని సమాచారం. నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా కుటుంబం మొత్తం హాజరు కానుంది. షూటింగ్స్ లో బిజీగా ఉన్న చరణ్, అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకొని, నిహారిక వెడ్డింగ్ కి సతీసమేతంగా హాజరుకున్నారట. సాయి ధరమ్, శిరీష్ లు కూడా ఈ పెళ్ళికి హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దీనితో పెళ్ళికి ఖచ్చితంగా హాజరు కావాలని నాగబాబు, పవన్ ని కోరారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం: టాలీవుడ్ న్యూస్