Bigg Boss Inaya Sultana: బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం నడిపి బోల్డ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ఇనయ సుల్తానా. అనంతరం తన గేమ్ తో అభిమానులను సంపాదించుకుంది. కాగా ఇనయ సుల్తానా ప్రస్తుత సంపాదన ఎంత? ఆమె అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఓపెన్ గా చూపించి షాక్ ఇచ్చింది అమ్మడు.
Also Read: క్యాస్టింగ్ కౌచ్ పై బ్రహ్మముడి కావ్య షాకింగ్ కామెంట్స్, నాకు కూడా ఎదురైంది అంటూ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఫోటోలు దిగి ఫేమస్ అయ్యింది ఇనయ సుల్తానా(Inaya Sultana). వర్మతో సన్నిహితంగా ఉన్న ఈ భామ ఎవరంటూ చర్చ జరిగింది. అనంతరం ఆమె బిగ్ బాస్ సీజన్ 6లో ఛాన్స్ దక్కించుకుంది. ఇనయ సుల్తానా గ్లామర్ ఫిదా చేసింది. అమ్మడు హౌస్లో సీరియస్ లవ్ స్టోరీ నడిపింది. ఆర్జే సూర్యను ఘాడంగా ప్రేమించింది ఇనయ. ఒకే కంచంలో తింటూ అప్పట్లో ఈ ప్రేమ జంట పాప్యులర్ అయ్యారు. సూర్యకు సేవలు చేస్తూ గేమ్ కూడా వదిలేసింది అమ్మడు. దాంతో హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
నాగార్జున వార్నింగ్ తో సూర్య-ఇనయ దూరంగా ఉంటున్నట్లు నటిద్దామని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్లాన్ లో భాగంగా సూర్యను నామినేట్ చేసింది ఇనయ. ఆమెకు షాక్ ఇస్తూ ఆ వారం సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దాంతో ఇనయ గుక్కపట్టి ఏడ్చింది. అతడు వెళ్ళిపోయాక ఆయన ప్లేట్ లో తింటూ, కప్ లో కాఫీ తాగుతూ ప్రియుడి జ్ఞాపకాల్లో బ్రతికింది. హౌస్ మేట్స్ అందరికీ దూరంగా ఉండే ఇనయ స్ట్రాంగ్ కంటెస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఒక దశలో టైటిల్ విన్నర్ గా ప్రచారమైంది. అనూహ్యంగా ఫైనల్ లో కూడా ఆమెకు చోటు దక్కలేదు.
ఇనయ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ పై ఇనయ తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు తనపై దాడి చేశాడని, ఆ వీడియోలు ఏవీ చూపించలేదని ఆమె అన్నారు. రేవంత్ తనకు చేసిన గాయాలు కూడా ఆమె చూపించారు. పరోక్షంగా బిగ్ బాస్ టీం రేవంత్ కి ఫేవర్ చేశాడు. అతడి దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఎపిసోడ్ లో ప్రసారం చేయలేదని చెప్పారు. బయటకు వచ్చిన ఇనయ సూర్యను కలవలేదు. ఓ జిమ్ ట్రైనర్ తో కొన్నాళ్ళు ఎఫైర్ నడిపింది. అతడితో విహారాలు చేసిన వీడియోలు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Also Read: జబర్దస్త్ శాంతి స్వరూప్ తో హైపర్ ఆది జలకాలు, వైరల్ వీడియో!
బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ ఆమెకు కొన్ని సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అయినప్పటికీ ఇనయ ఆర్థికంగా బలపడలేదు అట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇనయకు ఓ ప్రశ్న ఎదురైంది. యాంకర్ మీ బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలని కోరింది. ఫోన్ పే ఓపెన్ చేసిన ఇనయ ఓపెన్ గా తన అకౌంట్ లో ఎంత ఉందో రివీల్ చేసింది. ఇనయ అకౌంట్ లో కేవలం రూ. 700 చిల్లర ఉన్నాయి. నిజంగా ఇది ఆశ్చర్య పరిచే విషయమే. నేనేమి రిచ్ కాదన్న ఇనయ.. ప్రతి నెల ఈఎమ్ఐ లు కడతానని చెప్పింది.