https://oktelugu.com/

Inaya Sultana: బీచ్ లో పబ్లిక్ గా ప్రియుడితో బిగ్ బాస్ ఇనాయ ఘాటు రొమాన్స్… ఇదేం తెగింపు బాబోయ్!

బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా సోషల్ మీడియా పోస్ట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. ఆమె తన ప్రియుడితో పబ్లిక్ లో రొమాన్స్ చేస్తున్న వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ప్రైవేట్ వీడియోలను తలపిస్తున్న ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ పై కొందరు మండిపడుతున్నారు. తాజాగా ఆమె బీచ్ లో చేసిన పనికి అందరూ నివ్వెరపోతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 18, 2024 / 09:34 AM IST

    Inaya Sultana(1)

    Follow us on

    Inaya Sultana: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్ట్ చేసింది ఇనాయ సుల్తానా. దర్శకుడు వర్మ ఈమెను వెలుగులోకి తెచ్చాడు. రామ్ గోపాల్ వర్మతో మద్యం సేవిస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తున్న ఇనాయ సుల్తానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఎవరీ ఇనాయ సుల్తానా అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక బిగ్ బాస్ షో ఇనాయకు ఫేమ్ తెచ్చి పెట్టింది. గతంలో ఆమె చిన్న చిన్న చిత్రాల్లో నటించారు. కానీ గుర్తింపు రాలేదు.

    ఇనాయ అంచనాలకు మించి బిగ్ బాస్ షోలో రాణించింది. ఆమె ఓ ప్రేమ కథ నడిపింది. ఇనాయ సుల్తానా కంటెస్టెంట్ ఆర్జే సూర్యతో ప్రేమలో పడింది. సూర్య-ఇనాయ ఒకరికొకరు అన్నట్లు హౌస్లో మెలిగారు. ఇనాయ అయితే గేమ్ కూడా వదిలేసి సూర్యతో ప్రేమలో మునిగిపోయింది. హోస్ట్ నాగార్జున మందలించడంతో దూరంగా ఉంటున్నట్లు నటిద్దామని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు.

    దీనిలో భాగంగా 8వ వారం సూర్యను ఇనాయ నామినేట్ చేసింది. ఆ వారం అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఇనాయ బాగా ఏడ్చింది. సూర్య వాడిన వస్తువులు జ్ఞాపకాలుగా ఇనాయ సుల్తానా హౌస్లో వెళ్లదీసింది. సూర్య ఎలిమినేషన్ అనంతరం ఇనాయ స్ట్రాంగ్ గా తయారైంది. ముక్కుసూటిగా మాట్లాడేది. సింగిల్ గా గేమ్ ఆడుతూ 14వ వారం ఎలిమినేట్ అయ్యింది.

    ఇనాయ సుల్తానా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో ఆడియన్స్ ఇనాయ సుల్తానా ఎలిమినేట్ కావాల్సింది కాదని గగ్గోలు పెట్టారు. హౌస్ నుండి బయటకు వచ్చాక సింగర్ రేవంత్ టాస్క్ లలో తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె ఆరోపణలు చేసింది. ఫిజికల్ గా గాయపరిచాడని ఇనాయ దెబ్బలు చూపించింది. కానీ ఇవేవి ఎపిసోడ్లో రాలేదని ఆమె అన్నారు.

    ప్రస్తుతం నటిగా బిజీ అయ్యే పనిలో ఉన్న ఇనాయ. అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన శివమ్ భజే చిత్రంలో ఓ పాత్ర చేసింది. ఇనాయ ఫ్రైడే టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడం విశేషం. కాగా గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్ తో రిలేషన్ లో ఉంది ఇనాయ సుల్తానా. వీరిద్దరూ నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు.

    అయితే ప్రియుడు గౌతమ్ తో ఇనాయ సుల్తానా పబ్లిక్ లో రొమాన్స్ కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇనాయ-గౌతమ్ బీచ్ లో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో ఇనాయ తెగింపు చూసి.. జనాలు అవాక్కు అవుతున్నారు. సాంప్రదాయవాదులు తిట్టిపోస్తున్నారు. ఇనాయ హద్దులు మీరి ప్రవర్తించినట్లు ఆ వీడియో ద్వారా అర్థం అవుతుంది. గతంలో ఒకరిద్దరితో సీరియస్ ఎఫైర్ నడిపిన ఇనాయ గౌతమ్ తో శాశ్వతంగా కలిసి ఉంటుందా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.