Bigg Boss house : ఇండియా లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా చూసే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో మాత్రమే. విదేశాల్లో సంచలన విజయం సాధించిన ఈ షోని ముందుగా హిందీ లోకి తీసుకొచ్చారు. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఇతర భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ అయ్యింది. ఫేడ్ అవుట్ అయిపోయి సినిమాలకు చాలా కాలం నుండి దూరంగా ఉంటూ వస్తున్న ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు ఈ రియాలిటీ షో సరికొత్త జీవితాన్ని అందించింది. తెలుగు లో ఇప్పటికే 8 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, త్వరలోనే 9వ(Big Boss 9 Telugu) సీజన్ ని కూడా ప్రారంభించుకోనుంది. సెప్టెంబర్ నెల నుండి మొదలయ్యే ఈ సీజన్ లో సామాన్యులు కూడా కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య వివిధ రకాల రిలేషన్స్ ఏర్పడడం సహజమే. ఒకరిని ఒకరు ప్రేమించుకోవచ్చు కూడా. ఇది వరకు మనం మన తెలుగు బిగ్ బాస్ లోనే ఎన్నో లవ్ ట్రాక్స్ చూసాము. వీటి గురించి ఎండోమెల్ షైన్(Endemol Shine) ఇండియా లో బిగ్ బాస్ ప్రాజెక్ట్ హెడ్ గా పనిచేస్తున్న అభిషేక్ ముఖర్జీ(Abhishek Mukherji) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘బయట ప్రపంచం లో ప్రియుడి తో ప్రేమలో విఫలమైన ఒక ప్రముఖ నటి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. కనీసం ఇక్కడైనా అతన్ని మర్చిపోయి, ప్రశాంతంగా ఉండొచ్చేమో అనుకుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక కంటెస్టెంట్ తో ప్రేమలో పడింది. అతనే తన లోకం అన్నట్టుగా భావించింది’
Also Read: కన్నప్ప సినిమాను ప్రభాస్ కూడా కాపాడలేకపోయాడా..?
‘కానీ ఆ కంటెస్టెంట్ ఆమెని నిజంగా ప్రేమించలేదు, తన గేమ్ కోసం ప్రేమించినట్టు నటించాడు. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్న ఆ నటి మనస్తాపానికి గురై బాత్ రూమ్ కి వెళ్లి ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆమె చేస్తున్న ఆ పనిని మేమంతా గమనించి సెట్స్ లోకి పరుగులు తీసి ఆమెని అడ్డుకున్నాం. మా లక్ ఏమిటంటే మాకు ఒక సైకియాట్రిస్ట్ అందుబాటులో ఉండేవాడు. ఆయన ముంబై నుండి ఇక్కడికి వచ్చే వరకు మేము అతనితోనే టచ్ లోనే ఉన్నాం. అతను వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మానసిక పరిస్థితిని చెక్ చేయించి అదే వారం లో ఎలిమినేట్ చేసి పంపేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ నటి ఎవరో పేరుని ప్రస్తావించలేదు కానీ, ఇలా చేసింది మాత్రం తమిళ బిగ్ బాస్ లోని ఓవియా అనే అమ్మాయి అనుకోవచ్చు. ఈమె ఆరవ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించింది, కానీ అతను మాత్రం ఈమె ప్రేమని అంగీకరించలేదు. దీంతో ఆమె ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. అప్పట్లో ఈ ఘటన ఒక సంచలనం, దీని గురించే ఆయన మాట్లాడి ఉంటాడని అంటున్నారు నెటిజెన్స్.