Aadi Reddy – Geetu: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఎలాంటి ఎమోషన్స్ కి తావు ఇవ్వకుండా ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది గీతూ రాయల్ అనే చెప్పాలి..కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె ఆది రెడ్డి తో స్నేహం చెయ్యడం ప్రారంభించింది..తన వ్యక్తిగత విషయాల నుండి ప్రతి ఒక్కటి అతనితో షేర్ చేసుకుంటూ వచ్చేది గీతూ..అలా అతనితో మంచి బాండింగ్ ఏర్పడడం వల్ల గత వారం అతను ఎలిమినేట్ అవుతాడేమో అని భయపడి వెక్కిళ్లు పెట్టిమరీ ఏడ్చింది.

ఇది చూసి అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు..ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో ఆది రెడ్డి మరియు గీతూ వేరు వేరు టీమ్స్ గా విడిపోయి..టీం లీడర్స్ గా వ్యవహరించారు..టాస్కులు బాగా రసవత్తరం గా సాగడం తో ఎవ్వరు ఊహించని స్ట్రాటజీలు వేసి బ్లూ స్క్వాడ్ టీం ని బురిడీ కొట్టించింది గీతూ..అయితే మొన్న అర్థ రాత్రి ఆమె ఆది రెడ్డి టీ షర్ట్ ని దొంగలించి స్ట్రిప్స్ అన్ని లాగేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.
ఆ తర్వాత పక్క రోజు శ్రీహాన్ కి ఆ స్ట్రిప్స్ ఇచ్చి ఇది నీ బాడీ కి ఊరికే అలా వేలాడుతున్నట్టు వాళ్లకి కనపడకుండా తగిలించుకో..ఆ తర్వాత మేము వాటిని అన్నిటిని లాగేస్తాము..బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం బాడీ మీద ఉన్న టీ షర్ట్ స్ట్రిప్స్ లాగితేనే అవుట్ అన్నట్టు..కాబట్టి బాడీ నుండి లాగుతున్నాం కాబట్టే ఆది రెడ్డి అవుట్ లెక్క కిందకి వస్తాడు అని ఒక స్ట్రాటజీ వేస్తుంది..శ్రీహాన్ దాని ప్రకారమే ఫాలో అవుతాడు..ఆది రెడ్డి కి కోపం కట్టలు తెంచుకొని ఆయన ధరించిన టీ షర్ట్ మరియు మైక్ ని నేలకేసి పగలగొడుతాడు..బిగ్ బాస్ ప్రాపర్టీ ని డ్యామేజ్ చేసినందుకు గాను ఆది రెడ్డి ని కెప్టెన్సీ టాస్కు నుండి తొలగించేస్తాడు బిగ్ బాస్.

అలా ఎవ్వరి ఊహకందని విధమైన స్ట్రాటజీ వేసి ఆది రెడ్డి ని ఓడించిన తర్వాత అతని దగ్గరకి వెళ్లి క్షమాపణలు చూపండి గీతూ..’ఎదో ఒకరు నీ రెండు కళ్ళలో నుండి నీళ్లు రప్పించే విధంగా చేస్తాను..నీలాగా మోసపూరిత గేమ్ మాత్రం ఆడాను అప్పుడు కూడా..న్యాయంగానే నీ చేత కంటతడి పెట్టించకపోతే నా పేరు ఆది రెడ్డి కాదు’ అని సవాలు విసురుతాడు.