Bigg Boss 6 Telugu-Sri Satya: కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. వాళ్లలో కాన్ఫిడెన్స్ టెస్ట్ చేస్తున్నాడు. ఎంత మంది ఖచ్చితంగా నేను గెలుస్తానని భావిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. దీని కోసం ఆయన ఒక సీరియస్ టాస్క్ కండక్ట్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉండగా… ఒకరు ఇమ్యూనిటీ పొంది సేవ్ కావచ్చు. అలా ఇమ్యూనిటీ పొందాలంటే బిగ్ బాస్ ఇచ్చిన చెక్ పై ఒక అమౌంట్ రాసి డ్రాప్ బాక్స్ లో వేయాలి. హైయెస్ట్ అమౌంట్ చెక్ లో రాసిన కంటెస్టెంట్ నామినేషన్ నుండి సేవ్ అవుతాడు. అయితే ఆ అమౌంట్ టైటిల్ విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ రూ. 50 లక్షల నుండి తగ్గిస్తారు.

కాబట్టి యాభై లక్షల లోపు ఎంత అమౌంట్ అయినా చెక్ పై రాయవచ్చు. ఉదాహరణకు తొమ్మిది మందిలో ఒకరు రాసిన హైయెస్ట్ అమౌంట్ రూ. 40 లక్షలు అనుకుంటే టైటిల్ విన్నర్ కి వచ్చేది రూ. 10 లక్షలు మాత్రమే. చెక్ పై కంటెస్టెంట్స్ రాసే అమౌంట్ ఇతర కంటెస్టెంట్స్ కి చూపించకూడదు. అలాగే చెప్పకూడదు, చర్చించకూడదు.
ఈ గేమ్ ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటంటే… టైటిల్ గెలుస్తామని నమ్మకం లేని కంటెస్టెంట్స్ కనీసం ఒక వారం సేవ్ అవుతామని ఎక్కువ అమౌంట్ రాస్తారు. టైటిల్ విన్నర్ నేనే అని నమ్మిన వాళ్ళు రూ. 50 లక్షల టార్గెట్ గా తక్కువ అమౌంట్ రాస్తారు. ఇక నామినేషన్స్ లో ఉన్న ఆదిరెడ్డి, రేవంత్, ఇనయా, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, రాజ్, మెరీనా, రోహిత్ తమ అమౌంట్స్ రాసి చెక్స్ బాక్స్ లో వేశారు.

కాగా ఈ టాస్క్ లో శ్రీసత్య రూల్స్ అతిక్రమించింది. చెక్ పై రాసిన అమౌంట్ ఇతరులకు చెప్పకూడదు, చర్చించకూడదని బిగ్ బాస్ చెప్పిన నేపథ్యంలో శ్రీసత్య బ్రేక్ చేసింది. దీంతో ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ శ్రీసత్య కోల్పోయింది. శ్రీసత్యను డిస్ క్వాలిఫై చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. బిగ్ బాస్ ప్రకటనతో శ్రీసత్య ఖంగుతింది. కాగా ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ టాస్క్ లో గెలిచి నామినేషన్ నుండి తప్పుకునేది ఎవరు? తప్పుకుంటే ఎంత అమౌంట్ రాశారు? అనేది కీలకం కానుంది. ఎందుకంటే ఇక్కడ ఒక వారం సేవ్ కావడానికి స్వార్థంతో రాసే అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది. మరి చూడాలి ఏం జరగనుందో…