Arjun-Gautham: బిగ్ బాస్ సీజన్ 7కి ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ లభించింది. షో సూపర్ సక్సెస్ కావడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. కాగా మాజీ కంటెస్టెంట్స్ అందరూ మరోసారి ఒక చోట కలుసుకున్నారు. బీబీ ఉత్సవం పేరుతో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో కంటెస్టెంట్స్ సందడి చేశారు.హౌస్ లో ఏర్పడిన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫన్నీ గేమ్స్, దుమ్ము లేపే డాన్సులు, జోక్స్ తో అలరించారు. ఇటీవల అర్జున్ తండ్రి అయిన విషయం తెలిసిందే. గౌతమ్, అర్జున్ పాప కోసం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది.
అర్జున్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్లో అడుగుపెట్టాడు. సత్తా చాటి ఫైనల్స్ లో నిలిచాడు. కాగా అర్జున్- గౌతమ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. గౌతమ్… అర్జున్ ని అన్నా అని పిలుస్తూ అతనితో చాలా క్లోజ్ గా ఉండేవాడు. అర్జున్ తో అన్ని షేర్ చేసుకునేవాడు.అలా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ గా మారిపోయారు.
ఇప్పుడు బీబీ ఉత్సవంలో స్పెషల్ గిఫ్ట్ తో అర్జున్ ని సర్ప్రైజ్ చేశాడు గౌతమ్. తన అన్న అర్జున్ కి రీసెంట్ గా అమ్మాయి పుట్టింది. పాప కోసం చిన్న గిఫ్ట్ అంటూ గౌతమ్ అర్జున్ కి వెండి పట్టీలు ఇచ్చాడు. గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్ కి అర్జున్ ఫిదా అయ్యాడు. కూతురితో మొదటి క్షణాలను బీబీ ఉత్సవం వేదిక సాక్షిగా పంచుకున్నాడు.
పుట్టిన వెంటనే నేను పాపను చేతుల్లోకి తీసుకున్నాను. సాధారణంగా పిల్లలు అప్పుడే కళ్ళు తెరవరు. కానీ నా పాప పెద్ద కళ్ళు చేసుకుని నా వంక చూసింది. పాపకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా… అని అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అర్జున్ హౌస్లో ఉండగా భార్య సురేఖ చూసేందుకు వచ్చింది. గర్భవతిగా ఉన్న సురేఖకు కంటెస్టెంట్స్ సీమంతం చేయడం జరిగింది.