Shanmukh Jaswanth: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు షణ్ముఖ్ తో పాటు ఆయన అన్నయ్య సంపత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు విషయమై షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. విషయంలోకి వెళితే… షణ్ముఖ్ అన్నయ్య సంపత్… డాక్టర్ మౌనికను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను కాదని వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడు, చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దాంతో సంపత్ కోసం హైదరాబాద్ పోలీసులు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. అనూహ్యంగా ఇంట్లో అన్నదమ్ములు గంజాయి సేవిస్తూ కనిపించారు. షణ్ముఖ్ ఇంట్లో గంజాయిని పోలీసులు కనుగొన్నారు. ఒక కేసు కోసం వెళితే వాళ్లకు మరో కేసు దొరికింది. గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీస్తుంటే అడ్డుకున్నాడని సమాచారం. షణ్ముఖ్, సంపత్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ గా ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ అరెస్ట్ కలకలం రేపుతోంది.
గతంలో కూడా షణ్ముఖ్ అరెస్ట్ కాబడ్డాడు. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతివేగంగా కారు నడిపి వాహనాలు ధ్వంసం చేశాడు. అలాగే కొందరికి గాయాలు అయ్యాయి. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో షణ్ముఖ్ మోతాదుకు మించి తాగలేదని తేలింది. దాంతో తక్కువ శిక్షతో బయటపడ్డాడు. తాజాగా ఏకంగా డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు.
షణ్ముఖ్ పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, కవర్ సాంగ్స్ చేశాడు. ఆయన నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ ప్రేక్షకాదరణ పొందింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నాడు. టైటిల్ రేసులో నిలిచిన షణ్ముఖ్ ఫైనల్ కి వెళ్ళాడు. సన్నీ-షణ్ముఖ్ మధ్య టైటిల్ పోరు నడిచింది. సన్నీ విన్నర్ కాగా షణ్ముఖ్ రన్నర్ అయ్యాడు. కాగా దీప్తి సునైనతో షణ్ముఖ్ ఏళ్ల తరబడి ఎఫైర్ నడిపారు. బిగ్ బాస్ షోలో షణ్ముఖ్… సిరితో సన్నిహితంగా ఉన్నాడు. దాంతో దీప్తి బ్రేకప్ చెప్పింది.
Web Title: Bigg boss fame shanmukh jaswanth arrested
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com