https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మానసిక స్థితి ఎలా ఉంటుంది? నాలుగు గోడల మధ్య జరిగే ఘోరాలు ఎన్నో!

బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. మానసికంగా,శారీరకంగా దృఢంగా ఉండాలి. నాలుగు గోడల మధ్య ప్రపంచానికి, అయినవారికి దూరంగా బతకడం నరకంతో సమానం. కడుపు నిండా తిండి కూడా ఉండదు. బిగ్ బాస్ హౌస్లో ఎంత దుర్భర పరిస్థితి ఉంటుందో మాజీ కంటెస్టెంట్ ఒకరు బయటపెట్టారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 12, 2024 / 04:04 PM IST
    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ కి వెళితే ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవచ్చు. చాలా డబ్బు వస్తుందని చాలా మంది ఆశపడుతుంటారు. ఒక్కసారైనా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని తపన పడుతుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్లో జీవితం అంత సులభం కాదంటున్నాడు మాజీ కంటెస్టెంట్. అక్కడ జరిగేది ఒకటి అయితే ఎడిటింగ్ లో మరోలా చూపిస్తారు. తిండి కోసం కొట్టుకు చావాలి అంటూ బిగ్ బాస్ బాగోతాన్ని బయటపెట్టాడు. అతడు ఎవరో కాదు యాంకర్ రవి.

    బిగ్ బాస్ సీజన్ 5లో యాంకర్ రవి కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. యాంకర్ గా రవి కి ఉన్న క్రేజ్ రీత్యా అతనే సీజన్ 5 విన్నర్ అని అంతా భావించారు. కానీ లోపలంతా రివర్స్ లో జరిగింది. విన్నర్ అవ్వడం ఏమోకానీ రవి ని జోకర్ ని చేసి పారేశాడు బిగ్ బాస్. ముఖ్యంగా లహరి విషయంలో రవి ని టార్గెట్ చేశారు. బ్యాచిలర్స్ ఉండగా పెళ్ళైన నా వెంట పడుతుంది లహరి అని ప్రియతో రవి చెప్పాడు. ఆ వీడియోలు నాగార్జున ప్లే చేసి చూపించి ఇష్యూ ని హైలెట్ చేశారు. దీనివల్ల రవి ఇమేజ్ డ్యామేజ్ అయింది.

    రవి హౌస్ లో ఉన్నన్ని రోజులు అతన్ని నెగిటివ్ గానే చూపించారు. ఆ సీజన్ లో బిగ్ బాస్ ఆటకి రవి బలైపోయాడు. తాజాగా రవి బిగ్ బాస్ బండారం బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ .. బిగ్ బాస్ అంటే ఏం లేదు. ఒకడు బాగా గేమ్ ఆడుతుంటే వాడిని నెగ్గ నివ్వకుండా కిందకి లాగడమే. ఒకడు పర్ఫామెన్స్ తో ముందుకు వెళ్తాడు. పక్కవాడు వాడిని కిందకు లాగేసి వీడు పైకి వెళ్ళాలి అని చూస్తాడు.

    20 మంది చేసేది ఇదే. ఇక శనివారం ఎవరిది బ్యాడ్ పర్ఫామెన్స్ అని చెప్పాలి. ఆదివారం నాగార్జున వచ్చి ఏదో ఫిట్టింగ్ పెడతారు. సోమవారం నామినేషన్స్ .. మూడు రోజులు కొట్టుకు చస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరిని నామినేట్ చేయాలి. అందుకు ఎలాంటి రీజన్స్ చెప్పాలి అని విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. తిండి కూడా సరిగా ఉండదు. ఒక్క పచ్చడి బాటిల్ ఇస్తారు. దాని దగ్గర కూడా గొడవలు. నేను హౌస్ లో 85 రోజులు ఉంటే 10 కేజీల;యూ బరువు తగ్గాను.

    శ్రీరామ చంద్ర 12 కేజీలు, షణ్ముఖ్ జస్వంత్ 15 కేజీలు బరువు తగ్గారు. హౌస్ లో ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు అది చూపించరు. వాళ్లకు కావాల్సింది నచ్చినట్లు ఎడిట్ చేసి చూపిస్తారు. మిగతాది అన్ సీన్ లో టెలికాస్ట్ చేస్తారు. కుటుంబ సభ్యుల గురించి ఎంత అడిగినా చెప్పరు. చాలా మంది కెమెరాల దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను చేసిందే హైలెట్ చేసి చూపించారు. నేను సన్నీ, శ్రీరామ చంద్రతో క్లోజ్ గా ఉన్నాను. కానీ అది ఏమి చూపించలేదు అని రవి చెప్పుకొచ్చాడు. కాగా త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రసారం కానుంది.