7 seater cars : 7 సీటర్ కార్లకు డిమాండ్.. లో బడ్జెట్ మోడల్స్ ఏవో తెలుసా?

ఒకప్పుడు మారుతి కార్లు అంటే హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతాయన్న ధోరణి ఉండేది. కానీ వినియోగదారులకు ఆకర్షించడానికి ఈ కంపెనీ ఎస్ యూవీ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు 7 సీటర్ అయినా ఎర్టీగాను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఎర్టీగాకు మంచి డిమాండ్ ఉంది.

Written By: Chai Muchhata, Updated On : August 12, 2024 4:15 pm

7 Seater cars

Follow us on

7 seater cars : భారతదేశ మార్కెట్లో ఎస్ యూవీలకు డిమాండ్ పెరిగిపోతుంది. విశాలమైన స్పేస్ తో పాటు సౌకర్యవంతంగా ఉండే ఈ కార్లను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి కంపెనీలే కాకుండా మారుతి నుంచి కూడా ఆకట్టుకునే ఎస్ యూవీలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఎస్ యూవీలతో పాటు 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు 7 సీటర్ కారు అంటే ఇన్నోవా, సఫారీ మాత్రమే గుర్తింపు పొందాయి. కానీ ఇప్పుడు మారుతి నుంచి ఎర్టీగా లాంటి కార్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఎస్ యూవీలు రూ.10 లక్షలకు పైగానే ధర పలికే అవకాశం ఉంటుంది. కానీ కార్ల కంపెనీల మధ్య పోటీ కారణంగా కొన్నికంపెనీలు ధర తక్కువగా చేశాయి. అయితే లో బడ్జెట్ లో వచ్చే 7 సీటర్ కార్లు ఏవో తెలుసుకుందాం..

ఒకప్పుడు మారుతి కార్లు అంటే హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతాయన్న ధోరణి ఉండేది. కానీ వినియోగదారులకు ఆకర్షించడానికి ఈ కంపెనీ ఎస్ యూవీ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు 7 సీటర్ అయినా ఎర్టీగాను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఎర్టీగాకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.దీనిని రూ. 8 నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారు.

రెనాల్ట్ కంపెనీ పేరు చెప్పగానే డస్టర్ గుర్తుకు వస్తుంది. కానీ ఈ కంపెనీకి చెందిన ట్రైబర్ 7 సీటర్ కారు కూడా ఆకర్షిస్తోంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు విక్రయిస్తున్నారు.ఇందులో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ కలిగి ఆకర్షిస్తోంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఈ కారు గురించి సెర్చ్ చేస్తున్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు ప్రత్యేకంగా ఉంటాయి. దీని నుంచి రిలీజ్ అయిన బొలోరో 7 సీటర్ చాలా మందిని ఆకట్టుకుంది. ఎక్కువగా విలేజ్ ప్రాంతానికి చెందిన వారు దీనిని సొంతం చేసుకున్నారు. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ. 9 లక్షల వరకు విక్రయిస్తున్నారు. రూ.10 లక్షల లోపులో కారు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులో ఉంది. బెస్ట్ సేప్టీ కారు కావాలనుకునేవారు బొలెరోను ఎంపిక చేసుకోవచ్చు.

7 సీటర్ వేరియంట్ లో మరో కారు అందుబాటులో ఉంది. అదే బొలెరో నియో. ఇది లేటేస్ట్ టెక్నాలజీతో పాటు ఇంజిన్ సామర్థ్యం బలంగా ఉంది. అయితే దీనిని రూ.9.95 లక్షల నుంచి 12.15 లక్షల మధ్య ఉంటుంది. దీని ధర కాస్త ఎక్కువైనా సేప్టీ ఫీచర్స్ బాటుంటాయన్న ప్రచారం ఉంది. అయితే లాంగ్ జర్నీ చేసేవాళ్లకు ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.