Bigg Boss Telugu 8: హౌస్ లో క్లాన్స్ ని రద్దు చేసిన బిగ్ బాస్..ఏడ్చేసిన నభీల్..విష్ణు ప్రియ పై ఫైర్ అయిన పృథ్వీ!

విష్ణు ప్రియ మెగా చీఫ్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. పృథ్వీ, నిఖిల్ ప్రాణం పెట్టి మెగా చీఫ్ టాస్కులు గెలిస్తే, విష్ణు ప్రియ రాయల్స్ క్లాన్ సభ్యుల వల్ల మెగా చీఫ్ అయిపోయింది. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు.

Written By: Vicky, Updated On : October 28, 2024 7:59 pm

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో నేడు నామినేషన్స్ చాలా ఫైర్ మీద జరగబోతున్నాయి. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం నుండి నామినేషన్స్ ప్రక్రియ మొదలు అవుతుంది. కానీ టెలికాస్ట్ అయ్యేది మాత్రం సోమవారం రోజే. ఒకప్పుడు నామినేషన్స్ ఎపిసోడ్స్ కేవలం సోమవారం ఒక్క రోజు మాత్రమే టెలికాస్ట్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం సోమవారంతో పాటు, మంగళవారం కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గత వారం ఎలాంటి కష్టం చేయకుండా విష్ణు ప్రియ మెగా చీఫ్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. పృథ్వీ, నిఖిల్ ప్రాణం పెట్టి మెగా చీఫ్ టాస్కులు గెలిస్తే, విష్ణు ప్రియ రాయల్స్ క్లాన్ సభ్యుల వల్ల మెగా చీఫ్ అయిపోయింది. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు.

ఈ ప్రోమో ప్రారంభంలో బిగ్ బాస్ విష్ణు ప్రియ తో మాట్లాడుతూ ‘నీ చివరి నామినేషన్ ఎవరో చెప్పాల్సిందిగా కోరుతాడు’. అప్పుడు విష్ణు ప్రియ నభీల్ పేరు చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు నామినేషన్ వేసిందో కారణం చెప్తూ ‘నభీల్..నిన్ను నేను నా సోదరుడిగా భావించి చెప్తున్నాను’ అని అనగానే, నన్ను బ్రదర్ అని పిలవకు, నాకు బిగ్ బాస్ హౌస్ లో అక్కచెల్లెలు లేరు అని అంటాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీలో ఫన్ తగ్గింది, ఫైర్ తగ్గింది అని అంటుంది విష్ణు ప్రియ. దానికి నభీల్ సమాధానం చెప్తూ ‘నువ్వు 24 గంటలు పృథ్వీ చుట్టూ తిరిగితే మేమెక్కడ కనపడుతాము. ఫైర్ తగ్గింది అంటున్నావ్, టాస్కులలో నా క్రింద ఫైర్ ఉంది కాబట్టే, నిన్ను మెగా చీఫ్ చేయడానికి అంతలా రాయల్ క్లాన్ సభ్యులతో పోరాడాను’ అని అంటాడు నభీల్.

ఇక ఆ తర్వాత నభీల్ జైలులోకి వెళ్లిన తర్వాత ప్రేరణతో చెప్పుకుంటూ ఏడ్చేస్తాడు. పృథ్వీ కూడా విష్ణు ప్రియ నామినేషన్స్ పట్ల చాలా అసంతృప్తితో ఉంటాడు. ఇక నుండి నేను విష్ణు ప్రియ ని మెగా చీఫ్ అయ్యేందుకు ఎప్పుడూ సపోర్టు చేయను అని అంటాడు. ఇదంతా పక్కన పెడితే, నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ఇస్తాడు. ఇక నుండి హౌస్ లో క్లాన్స్ ఉండవని, కంటెస్టెంట్స్ అందరూ ఎవరికీ వారు సొంతం గా ఆడాలని, బిగ్ బాస్ నిర్ణయించినట్టుగానే భవిష్యత్తులో టీమ్స్ ఏర్పడుతాయని అంటాడు బిగ్ బాస్. ఇప్పటి నుండి ఆట ఎలా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు క్లాన్స్ గా విడిపోయి కొట్టుకున్న ఇంటి సభ్యులు, భవిష్యత్తులో ఒకే టీం లో పాల్గొనవచ్చు. స్నేహితులు శత్రువులు ,శత్రువులు స్నేహితులుగా మారే అవకాశాలు రాబోయే ఎపిసోడ్స్ లో మనమంతా చూడొచ్చు. ఇక్కడి నుండి అసలు సిసలు గేమ్ మొదలైనట్టే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.\