Naga Manikanta : 16 మందికి కేవలం రెండే ఇచ్చేవారు..బిగ్ బాస్ టీం నాకు నరకం చూపించారు అంటూ నాగ మణికంఠ ఎమోషనల్ కామెంట్స్!

బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత మణికంఠ బోలెడన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. వాటిల్లో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు?, ఒత్తిడిని తట్టుకోలేక ఎందుకు బయటకి వచ్చాడు వంటివి ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Written By: Vicky, Updated On : October 28, 2024 8:04 pm

Naga Manikanta

Follow us on

Naga manikanta  : ఈ సీజన్ బిగ్ బాస్ షోలో అతి పెద్ద ట్విస్ట్ ఏదైనా ఉందా అంటే అది నాగమణికంఠ ఎలిమినేషన్. షో ప్రారంభం అవ్వడానికి ముందు అన్ లిమిటెడ్ ట్విస్టులు, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రోమోస్ ద్వారా ఊదరగొట్టారు. వాళ్ళు చెప్పిన ఆ రెండు అంశాలను జనాలు ఫీల్ అవ్వలేదు కానీ, మణికంఠ ఎలిమినేషన్ ని మాత్రం మంచి ట్విస్టుగా ఫీల్ అయ్యారు. కానీ ఆ ట్విస్ట్ షో ప్లస్ అవ్వలేదు. పెద్ద మైనస్ అయ్యింది, మణికంఠ ఉంటే బోలెడంత డ్రామా ఉండేది, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది. అతని నుండి కంటెంట్ పాజిటివ్ గా వచ్చినా, నెగటివ్ గా వచ్చినా చూసే ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేది. కేవలం మణికంఠ కోసం షో చూసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఎలిమినేట్ అయ్యాక షో చూడడం మానేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత మణికంఠ బోలెడన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. వాటిల్లో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు?, ఒత్తిడిని తట్టుకోలేక ఎందుకు బయటకి వచ్చాడు వంటివి ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ ఉదయాన్నే పెద్ద సౌండ్ తో సాంగ్స్ పెట్టి లేపేవారు. నా తల బద్దలైపోయేది. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఆ సౌండ్ ని చూసి భయపడేవాడిని. 16 మంది కంటెస్టెంట్స్ కి కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉండేవి. కాలకృత్యాలు మొత్తం పూర్తి చేసి టిఫిన్ చేసేలోపే మధ్యాహ్నం అయిపోతుంది. రేషన్ కి సమయం ఉండేది కాదు. దొరికిన ఐటమ్స్ తోనే కూరలు వండేవారు. వాటిల్లో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. వాటిని తినలేక కేవలం చపాతీలను తినేవాడిని. అవి టాస్కులు ఆడేందుకు సరిపోయే బలాన్ని ఇచ్చేది కాదు. ఇక ఇష్టం లేకపోయినా ఆ చప్పిడి కూరలను తినేవాడిని. ఒకవేళ తినలేక పారేద్దాం అనుకుంటే బిగ్ బాస్ ఒప్పుకోడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆహరం విలువ తెలిసొచ్చింది. ఈ నరకాన్ని అనుభవించలేక నా ఆరోగ్యం చెడిపోయింది. ఇక టాస్కులు ఆడే సత్తా నాలో పోయేసరికి దండం పెట్టి బయటకి వచ్చేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ మణికంఠ. ఆయన చెప్పే మాటలను చూస్తుంటే బిగ్ బాస్ లో ఉండడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎమోషనల్ గా, ఫిజికల్ గా ఒక మనిషి కృంగిపోతాడు. బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అవ్వడానికి చాలా సమయం పడుతుంది. నిజంగా అవన్నీ తట్టుకొని వంద రోజులు హౌస్ లో ఉండే ప్రతీ ఒక్కరు విన్నర్ అనే అనాలి.