‘సుడిగాలి‘కి బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే టాప్!

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవ‌ర్ రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్క‌ష‌న్లో ఉంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు సీజ‌న్లు బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో.. ఐదో సీజ‌న్ కు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహ‌కులు. సెప్టెంబ‌ర్ 5న ప్రారంభం కావ‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది. దీంతో.. అంద‌రూ కంటిస్టెంట్ల మీద‌నే అంద‌రి ఫోక‌స్ పెట్టారు. ఎవ‌రు ఉండ‌బోతున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నాలుగో సీజ‌న్లో కంటిస్టెంట్ల విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. షో […]

Written By: Bhaskar, Updated On : August 11, 2021 10:43 am
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవ‌ర్ రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్క‌ష‌న్లో ఉంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు సీజ‌న్లు బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో.. ఐదో సీజ‌న్ కు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహ‌కులు. సెప్టెంబ‌ర్ 5న ప్రారంభం కావ‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది. దీంతో.. అంద‌రూ కంటిస్టెంట్ల మీద‌నే అంద‌రి ఫోక‌స్ పెట్టారు. ఎవ‌రు ఉండ‌బోతున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

నాలుగో సీజ‌న్లో కంటిస్టెంట్ల విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. షో తొలి రోజున‌.. వీళ్లంతా ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌చ్చారు? అంటూ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జ‌రిగింది. ఈ సీజ‌న్లో కొద్దిమంది మిన‌హా.. మిగిలిన వారంతా షోకు వ‌చ్చిన త‌ర్వాత ఫేమ‌స్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో కంటిస్టెంట్ల సెల‌క్ష‌న్ పై నిర్వాహ‌కులు దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

సినిమా, టీవీ, న్యూస్‌, సోష‌ల్ మీడియా.. ఇలా అన్ని కేటగిరీల్లో ఫేమ‌స్ అయిన వారిని తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సారి హీరోయిన్ ఈషా చావ్లా, హీరో అశ్విన్ బాబు ( రాజుగారి గ‌ది-3), సినీ న‌టి సురేఖ వాణి, డ్యాన్స్ మాస్టర్ శేఖ‌ర్, సింగ‌ర్ మంగ్లీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, బుల్లితెర విష‌యానికి వ‌స్తే.. యాంక‌ర్లు ర‌వి, వ‌ర్షిణి, విష్ణు ప్రియ‌, న‌టులు న‌వ్య‌స్వామి, సిద్ధార్థ్ వ‌ర్మ ఉన్న‌ట్టు స‌మాచారం. న్యూస్ యాంక‌ర్ విభాగంలో ప్ర‌త్యూష‌, సోష‌ల్ మీడియా నుంచి టిక్ టాక్ దుర్గారావు, శ‌ణ్ముఖ్ జ‌స్వంత్ త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే.. లేటుగా, లేటెస్టుగా లిస్టులోకి వ‌చ్చిన పేరు సుడిగాలి సుధీర్‌. ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ను కూడా ఐదో సీజ‌న్లోకి తీసుకుంటున్నార‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇత‌న్ని తీసుకోవ‌డ‌మే కాదు.. ఇందుకోసం భారీగా రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్టు టాక్‌. తెలుగు బుల్లితెర‌లో ఏ షోలో చూసినా సుధీర్ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఇత‌డికి ఉన్న డిమాండ్ దృష్ట్యా భారీ మొత్తం ఆఫ‌ర్ చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఈ సారి ఫేవ‌రెట్ కంటిస్టెంట్ గా ఉన్న‌వారిలో ఒక‌రైన‌ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ కు కోటిన్న‌ర రూపాయ‌లు పారితోషికంగా ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు బిగ్ బాస్ షోలో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ కోటి రూపాయ‌లు మాత్ర‌మే. అది కూడా శ్రీముఖి మాత్ర‌మే అందుకుంది. ష‌ణ్ముఖ్ దాన్ని తిర‌గ‌రాబోతున్నాడనే టాక్ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు సుధీర్ ఏకంగా 4.50 కోట్లు అందుకోబోతున్నాడ‌న్న వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఇంత మొత్తం ఇండియ‌న్ బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. మ‌రి, ఇందులో వాస్తవం ఎంత‌? అస‌లు సుధీర్ పార్టిసిపేట్ చేస్తున్నాడా? లేదా? అన్నది చూడాలి.