అదే విధంగా ఎఫ్ 2లోని వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని.. ఈ సీక్వెల్ లోనూ తమన్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే అనిల్ రావిపూడి కథను చెప్పేశాడు. డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టుకెళుతున్న వెంకటేష్, వరుణ్ లను చూపించాడు.
ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. తమన్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయని.. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి కథ పై క్లూ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారని.. సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారట. రెండేళ్ల క్రితం ‘ఎఫ్ 2’ అంటూ సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చి అలరించిన వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఈ సారి కూడా అదే స్థాయిలో అలరించేలా ఉన్నారు.