
Sai Dharam Tej Marriage: సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన గత చిత్రం రిపబ్లిక్ 2021 అక్టోబర్ లో విడుదలైంది. గత ఏడాది ఆయన నుండి ఒక్క చిత్రం రాలేదు. సాయి ధరమ్ నటించిన విరూపాక్ష విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన పెళ్లి, ప్రేమ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ… గతంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కొన్ని కారణాలతో ఆమెతో బ్రేకప్ అయ్యింది. అప్పటి నుండి నాకు అమ్మాయిలు అంటే భయం. ప్రేమలో విఫలం చెందాక నేను సైలెంట్ అయిపోయాను. మళ్ళీ అమ్మాయిల జోలికి పోలేదు అన్నారు. మరి పెళ్లి చెప్పుడు చేసుకుంటారని అడిగితే… ఒకరు చెప్పారని నేను పెళ్లి చేసుకోను.నాకు నచ్చినప్పుడు, ఇష్టమైనప్పుడు మాత్రమే చేసుకుంటాను అన్నారు. సాయి ధరమ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సాయి ధరమ్ కెరీర్ పరిశీలిస్తే ప్రతిరోజూ పండగే తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. సోలో బ్రతుకే సో బెటర్, చిత్రలహరి యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. రిపబ్లిక్ నిరాశపరిచింది. దీంతో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు. విరూపాక్ష థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. దర్శకుడు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు కార్తీ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ శిష్యులకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలో విరూపాక్ష చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది.

విరూపాక్ష మూవీకి మరో లక్కీ సెంటిమెంట్ ఉంది. హీరోయిన్ గా సంయుక్త నటించారు. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన బింబిసార, సార్ చిత్రాలు సూపర్ హిట్స్ కొట్టాయి. మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఇక ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి ధరమ్ ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు. వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. పవన్, సాయి ధరమ్ ఈ మూవీలో దానవుడు, మానవుడిగా కనిపించనున్నారు.