Tiruvuru MLA News: ఓ మహిళ ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు అని తెలియక ఏకంగా అతనితో ఓ బియ్యం బస్తాను మోయించింది. తీరా తెలిసాక ఒక్కసారిగా షాక్ కి గురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరువూరు బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సు విజయవాడ( Vijayawada) వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికే ప్రయాణికులు బస్సు ఎక్కారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున బస్సులో కనిపిస్తున్నారు. అయితే ఈ పథకం ఎలా అమలు అవుతుందని తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బస్సు ప్రయాణం చేశారు. కొద్ది దూరం బస్సులో ప్రయాణించారు. మహిళలతో ముచ్చటించారు. ఉచిత ప్రయాణ పథకం పై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మహిళలు ఎమ్మెల్యేతో తమ స్పందనను తెలియజేశారు.
Also Read: పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే ‘కొలిపూడి’ రచ్చరచ్చ
బస్సు దిగగానే..
అయితే ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు కంభంపాడు( khambampadu ) దగ్గరకు రాగానే ఆయన కిందకు దిగారు. ఇంతలో అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ‘ ఓ అబ్బాయి.. ఏమండీ కొంచెం ఈ బస్తా పడతారా ‘ అంటూ సాయం కోసం పిలిచింది. వెంటనే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి ఆ బస్తాలు బస్సు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తరువాత బస్సు కండక్టర్ వచ్చి నాకు ఇవ్వండి సార్ అంటూ అడిగాడు. కానీ ఎమ్మెల్యే కొలికపూడి పర్లేదు అంటూ ఆ బస్తాను తీసుకొచ్చారు. అటు తరువాత ఆ మహిళకు ఆయన ఎమ్మెల్యే అని అర్థమయింది. బస్తా ఇవ్వండి నేను తలపై పెట్టుకుంటానని ఆ మహిళ అడిగారు. పర్లేదు అమ్మ అంటూ ఎమ్మెల్యే బస్తాలు తీసుకెళ్లి బస్సులో పెట్టారు. మరో ప్రయాణికుడు అందుకుని లోపల పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణ మహిళ సాయం కోరడం, ఎమ్మెల్యే సాయం చేయడం పై చర్చ కొనసాగుతోంది.
Also Read: వైసీపీ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు.. కేసు రీ ఓపెన్!
అమరావతిపై జగన్ కు సవాల్
అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి ఎమ్మెల్యే కొలికపూడి( MLA Srinivasa Rao ) వచ్చిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అమరావతి పై విషం చిమ్ముతూ జగన్ సొంత మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై స్పందించారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి పై చర్చించేందుకు తాను సిద్ధమని.. జగన్ లేదా వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి అభిప్రాయంతోనే అమరావతిని ఎంపిక చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు కూడా ఇచ్చారని.. తాడేపల్లి లో ఇల్లు కూడా కట్టుకున్నారని.. ఆయన ఇల్లు వరదల్లో మునిగిపోయిందా అని ప్రశ్నించారు. ఇకనైనా అటువంటి విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.