Sabarmati Report Movie: ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులు జరుగుతున్నాయి.దర్శకులు ఎంచుకుంటున్న కథలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన మేకర్స్ ఇప్పుడు మాత్రం ప్రేక్షకుల్లో ఆలోచనను రేకెత్తించే కథలను రెడీ చేసుకొని వాటిని తెరకెక్కించి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు…ఇక దానికి తగ్గట్టుగానే థియేటర్లలోనే కాకుండా ఓటిటి సంస్థల్లో కూడా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించి వాటిని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఒరిజినల్ కథలతో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది…ప్రతి ప్రేక్షకుడు కూడా ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటన తాలూకు ఓరిజినాలిటి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి మేకర్స్ కూడా వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని అలాంటి తరహాలోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. 2002వ సంవత్సరంలో దేశాన్ని కుదిపేసిన సంఘటన మనకు తెలిసిందే…కదులుతున్న రైలు సజీవ దహనం అవ్వడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. నిజానికి ఈ ఘటనలో ఎన్నో అనుమానాలు, ఎన్నో పుకార్లనైతే పుట్టించారు.
Also Read: ‘వార్ 2’ కి ముందు అనుకున్న స్టోరీ ఇదేనా? అలా తీసుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది!
మొత్తానికైతే అలా జరగడానికి కారణం ఏంటి? అసలు ఆ రైలు సజీవ దహనం అవ్వడానికి ముందు ఏం జరిగింది అనే ధోరణిలో దర్శకుడు ధీరజ్ సర్నా మొత్తం రీసెర్చ్ చేసి ‘సబర్మతి రిపోర్ట్’ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ గతేడాది నవంబర్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాని 2002లో జరిగిన గోద్రా రైలు సంఘటనను ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా దర్శకుడు దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి రైలు సజీవ దానం అవ్వడానికి గల కారణాలను తెలుసుకొని మరి తీశాడు. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత పార్లమెంట్లో నరేంద్ర మోడీ సైతం గోద్రా రైలు సంఘటనకు సంబంధించిన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి అంటూ ఈ సినిమా గురించి మాట్లాడడం విశేషం…
Also Read: ఎన్టీఆర్ ‘దేవర 2’ ఆగిపోవడం పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..ఇది మామూలు ట్విస్ట్ కాదు!
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి ఓటిటి లో మంచి ఆదరణ దక్కుతోంది… ఇక ఇప్పటివరకు మీలో ఎవరైనా ఈ సినిమాని చూడకపోయి ఉంటే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ చూడచ్చు…