Maruti : మారుతి వాగన్ఆర్ భారతదేశంలో వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాలు 2022, 2023, 2024, 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి వాగన్ఆర్ అమ్మకాల్లో ఎప్పుడూ ముందుంటుంది. మారుతి సుజుకి వాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.65 లక్షల నుండి ప్రారంభమై రూ.7.48 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఈ ధర పరిధిలో టాటా టియాగో, టాటా పంచ్, హ్యుందాయ్ గ్రాండ్ i10 వంటి అనేక ప్రసిద్ధ ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ, ప్రజలు వాగన్ఆర్ కొనడానికి ఇష్టపడతారు. వాగన్ఆర్ భారతీయులకు మొదటి ఆఫ్షన్ కావడానికి గల 5 కారణాల గురించి తెలుసుకుందాం.
Also Read : ధరల బాదుడు.. ఆఫర్ల ఊరట! మారుతి ఏం చేస్తుందో దానికే తెలియాలి!
డిజైన్
వాగన్ఆర్ టాల్-బాయ్ డిజైన్ (ఎత్తైన బాడీ) దీనిని చాలా ప్రాక్టికల్‌గా చేస్తుంది. కారులో ఎక్కువ హెడ్‌రూమ్ లభిస్తుంది. దాని వలన పొడవైన వ్యక్తులు కూడా సౌకర్యవంతంగా కూర్చోవడానికి స్థలం లభిస్తుంది. లోపల మంచి స్పేస్ ఉంటుంది. దీనివలన 5-6 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. సామాను ఉంచడానికి తగినంత పెద్ద బూట్ స్థలం కూడా లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. దీని వలన పాడైన రహదారులపై డ్రైవ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. మొత్తానికి ఈ కారు నగరంలో రోజువారీ ఉపయోగం లేదా ఫ్యామిలీ టూర్లకు అయినా బాగుంటుంది.
లో మెయింటెనెన్స్, హై మైలేజీ
భారతీయ కస్టమర్లు మైలేజ్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వాగన్ఆర్ ఇందులో అగ్రస్థానంలో ఉంది. కారు పెట్రోల్ వేరియంట్‌లో లీటరుకు 23కిలో మీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. CNG వేరియంట్‌లో చూస్తే కిలోకు మైలేజ్ 34కిలో మీటర్ల కంటే ఎక్కువ వస్తుంది. ఇది దాని రన్నింగ్ ఖర్చును చాలా తగ్గిస్తుంది. అలాగే, మారుతి కార్లు లో మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది.
మారుతి అద్భుతమైన సర్వీస్ నెట్‌వర్క్:
భారతదేశంలో మారుతి సుజుకికి అతిపెద్ద సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. సర్వీస్ సెంటర్‌లు పుష్కలంగా ఉన్నాయి. చిన్న నగరాలు, గ్రామాలలో కూడా సర్వీస్, విడిభాగాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో విడిభాగాలు లభిస్తాయి. దీని వలన రిపేర్, మెయింటెనెన్స్ సులభం, చౌకగా ఉంటుంది. కారులో ఎప్పుడైనా సమస్య వస్తే వెంటనే సహాయం లభిస్తుందనే నమ్మకం కస్టమర్‌కు ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్స్
కొత్త తరం వాగన్ఆర్‌లో సేఫ్టీ చాలా మెరుగుపరిచారు. కారులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి భద్రతా ఫీచర్లు ప్రతి మోడల్‌లో లభిస్తున్నాయి. అలాగే, దీని బిల్డ్ క్వాలిటీ కూడా మునుపటి కంటే మెరుగుపడింది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది కస్టమర్‌లకు సరసమైన ధరకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
వెరైటీ, కస్టమైజేషన్ ఆప్షన్స్
వాగన్ఆర్ వివిధ ఇంజిన్ ఎంపికలు, పెట్రోల్, CNG వంటి ఇంధన రకాల్లో వస్తుంది. ఇందులో 1.0L, 1.2L పెట్రోల్ ఇంజిన్‌లు వంటి 2 ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. 1.0Lతో CNG ఎంపిక ఉంది. ఈ కారు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అంటే, ప్రతి కస్టమర్ వారి అవసరం, బడ్జెట్ ప్రకారం మోడల్‌ను ఎంచుకోవచ్చు.
Also Read : ఇండియాలో టెస్లాకి గ్రీన్ సిగ్నల్.. BYDకి మాత్రం నో ఎంట్రీ? అసలు కారణం ఇదే!