Bigg Boss 9 Telugu Sanjana Vs Flora Saini: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ మొదలైన రెండు రోజుల్లోనే మంచి హీట్ వాతావరణం లో కొనసాగుతుంది. మాస్క్ మ్యాన్ వల్ల ఎక్కువగా గొడవలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ, అతను సాధ్యమైనంత వరకు సెన్స్ తోనే అందరితో మాట్లాడుతున్నాడు. అవసరమైనప్పుడు మాత్రం గొంతు లేపుతున్నాడు. ఇమ్మానుయేల్ తో ప్రవర్తించిన తీరు ఒక్కటే బాగాలేదు కానీ, ఓవరాల్ గా మాస్క్ మ్యాన్ పర్వాలేదు అని అనిపిస్తున్నాడు. కానీ సంజన కారణంగా మాత్రం హౌస్ లో జరుగుతున్న గొడవలు మాములివి కావు. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టే ముందు నాగార్జున తో మాట్లాడుతూ, కొంతమంది నాపై లేనిపోని రూమర్స్ సృష్టించి అరెస్ట్ చేయించారని, హై కోర్టు తన తప్పు ఏమి లేదని క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా అది జనాల్లోకి పెద్దగా వెళ్లలేదని, ఇప్పుడు తాను ఎంత మంచి మనిషి అనేది జనాల ముందు ఈ షో ద్వారా నిరూపించుకుంటానని చెప్పుకొచ్చింది.
Also Read: రాజమౌళి సినిమాల్లో ఆ రెండు సినిమాలు బాగా ఆడలేదని చెప్పిన రమా రాజమౌళి…
ఈ మాట్లాడిన మాటలు విన్న తర్వాత సోషల్ మీడియా లో ఉండే విశ్లేషకులు కచ్చితంగా ఈమె తన మంచితనాన్ని చూపించే ప్రయత్నం లోనే ఉంటుంది కాబట్టి, ఈమె మాస్క్ ఇప్పట్లో బయటపడదు అని అనుకున్నారు. కానీ ఆమె రెండు మూడు సందర్భాలకు తన మాస్క్ ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఫ్లోరా షైనీ తో గొడవ, ఆమె మీద నోరు పారేసుకోవడం వంటివి చాలా అన్యాయంగా అనిపించింది. గొడవ ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఫ్లోరా షైనీ కి బాత్రూంలను క్లీన్ చేసే పని అప్పగించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇచ్చిన పనిని పాపం ఫ్లోరా షైనీ తూచా తప్పకుండా చేస్తూ తన నుండి ఎలాంటి తప్పు లేకుండా చూసుకుంటుంది. అయితే బాత్రూం లోపల సంజన స్నానం చేసి, ఆమెకి సంబంధించిన షాంపూ బాటిల్, ఫేస్ వాష్ బాటిల్, ఇలా కొన్నిటిని బాత్రూం లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇలా చెయ్యకూడదు, దయచేసి తీసేయండి అని ఫ్లోరా షైనీ చెప్పగా, సంజన మాట వినదు.
ఆ తర్వాత దానిని ఆమె పెద్ద సమస్య గా మార్చేస్తుంది. ఎంత మంది వచ్చి చెప్పినా ఆమె తియ్యదు. ఫ్లోరా షైనీ పై చాలా సీరియస్ గా నోరు పారేసుకుంటూ పెద్దగా అరుస్తుంది. దీంతో పాపం ఫ్లోరా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తుంది. జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంతో పవన్ వెంటనే బాత్రూం వద్దకు వెళ్లి, ఒక మానిటర్ గా చెప్తున్నాను, దయచేసి ఇవి తీసుకెళ్లండి అని అంటాడు. అప్పుడు సంజన నేను తీసుకెళ్ళను అని అతనితో కూడా యాటిట్యూడ్ తో సమాధానం చెప్తుంది. మీరు ఒక్కరు ఇక్కడ పెడితే, మిమ్మల్ని చూసి లేడీస్ అందరూ తమకు సంబంధించిన టాయిలేటరీస్ ని ఇక్కడే వదిలేసి వెళ్తారు. బాత్రూం కాస్త స్టోర్ అయిపోతుంది, దయచేసి తియ్యండి అని ఎంత చెప్పినా ఆమె వినదు. చివరికి హౌస్ మేట్స్ మొత్తం ఆమెపై రివర్స్ అయ్యేలోపు, ఇంకా లాగితే జనాలు ఇంటికి పంపిస్తారు అనే భయం వల్లనో ఏమో తెలియదు కానీ, తన వస్తువులు తాను తీసుకెళ్ళిపోయింది. ఇదంతా ఆమె కంటెంట్ కోసమే చేస్తున్నట్టు అనిపించింది కానీ, ఎక్కడా కూడా సహజత్వం కనిపించలేదు. అందుకే హౌస్ మేట్స్ అందరూ ఆమెని నామినేట్ చేశారు.