Bigg Boss 9 Telugu Tanuja: గత వారం వరకు కూడా ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నర్ ఎవరు అని అడిగితే, ప్రతీ ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు తనూజ. సోషల్ మీడియా పోల్స్, వెబ్ సైట్ పోల్స్ ఇలా ఎక్కడ చూసినా తనూజ నే అందరికంటే టాప్ స్థానం లో ఉంటూ వచ్చింది. కానీ ఈ వారం మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. గతం లో పవన్ కళ్యాణ్ కి తనూజ కి మధ్య కనీసం 30 శాతం ఓటింగ్ గ్యాప్ ఉండేది. కానీ ఈసారి మాత్రం కేవలం పది శాతం ఓటింగ్ గ్యాప్ మాత్రమే ఉందట. రాబోయే రోజుల్లో అది కూడా కవర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తనూజ కి గత వీకెండ్ నుండి నాన్ స్టాప్ గా నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. ఆమె పై మొదట ఆడియన్స్ లో చెడు అభిప్రాయం కలిగినది 9వ వారం అనొచ్చు.
ఆ వీకెండ్ లో భరణి డేంజర్ జోన్ లోకి రావడం, దాంతో ఆయన నోరు తెరిచి నన్ను సేవ్ చేసే అవకాశం వస్తే చేస్తావా అమ్మా అని అడగడం, అందుకు తనూజ అలోచించి చెప్తా అనడం ఆడియన్స్ కి విపరీతమైన కోపం రప్పించేలా చేసింది. ఇన్ని రోజులు నాన్న అని పిలిచి తెగ ప్రేమ ఉన్నట్టు కనిపించిన తనూజ, ఇప్పుడు తనకు ఇష్టమైన మనిషి వచ్చి సహాయం అడిగితే ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చింది ఏంటి అని ఆమె అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. ఇక గత వారం లో అయితే నాకు ఈ హౌస్ లో ఎవ్వరూ సపోర్ట్ గా లేరు సార్ అని చెప్పడం ఆమెపై ఇంకా నెగిటివిటీ ని పెంచేలా చేసింది. ఆడియన్స్ మాత్రమే కాదు, నాగార్జున కూడా షాక్ కి గురయ్యాడు ఆమె మాటలకు. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ లో ఆమె చెల్లి హౌస్ లోకి అడుగుపెట్టి బయట పరిస్థితి ని వివరించిందో అప్పటి నుండి తనూజ పూర్తిగా మారిపోయింది.
పవన్ కళ్యాణ్ కి బయట మంచి ఓటింగ్ పడుతోంది అనే విషయాన్ని అర్థం చేసుకున్న తనూజ, అప్పటి నుండే అతనితో స్నేహంగా ఉండడం మొదలు పెట్టింది. కానీ ఆమె చెల్లి వచ్చి వెళ్లిన తర్వాత ఇంకా క్లోజ్ అయిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తల్లి కి చీర పెట్టి పంపడం కూడా గేమ్ లో భాగమే. హౌస్ లో అందరూ నాకు సపోర్టు గానే ఉంటున్నారు, కానీ వాళ్ళకంటే నువ్వు కాస్త ఎక్కువగా నాకు సపోర్టు చేస్తున్నావు, అందుకే నీకోసం ఏదైనా చెయ్యాలని అనిపించి మీ అమ్మగారికి చీర పెట్టాను అని అంటుంది. నాలుగు రోజుల క్రితం హౌస్ లో నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు అని చెప్పుకొచ్చిన ఆమె, ఇంతలోపే నాకు అందరూ సపోర్టు ఉన్నారు, నువ్వు కాస్త ఎక్కువ అని చెప్పడం గేమ్ లో భాగమే అని అందరికీ అనిపిస్తోంది. అవతల కళ్యాణ్ ని చూస్తే, ఆయన నిజంగానే తనూజ ని ప్రేమిస్తున్నట్టు ఉంది, తనూజ కి అలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ ఈమధ్య రెచ్చగొడుతుంది. అలా పూర్తిగా కళ్యాణ్ ని తన కంట్రోల్ లో పెట్టుకొని, అతని గేమ్ ని తగ్గించి, తానూ పైకి వెళ్లాలని చూస్తుందని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.