Homeఆధ్యాత్మికంAshta Vinayaka Temples: అష్ట వినాయక క్షేత్రాలు... ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Ashta Vinayaka Temples: అష్ట వినాయక క్షేత్రాలు… ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Ashta Vinayaka Temples: మహాశివుడి జ్యోతిర్లింగాలు తెలుసు.. మహాశక్తి అష్టదశ పీఠాల గురించి విన్నాం.. కానీ మరో దేవుడికి కూడా అష్ట క్షేత్రాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఆ దేవుడు ఎవరో కాదు మహాగణపతి. ఏ పూజ కార్యక్రమం అయినా.. గణపతికి నివేదించిన తర్వాతే ప్రారంభించాలి. అంటే గణపతి పూజ చేసిన తర్వాతనే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. అలాంటి మహాగణపతికి 8 గణపతి క్షేత్రాలు ఉన్నాయన్న విషయం కొంతమందికే తెలుసు. ఈ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల ఎన్నో జన్మల పాపం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు. మరి వినాయకుడి కి ఉండే ఈ అష్ట క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటికి ఏమని పేర్లు పెట్టారు?

Also Read: గుడిలో ఆడవారు తలనీలాలు సమర్పించవచ్చా?

మహాగణపతికి 8 ఆలయాలు మహారాష్ట్రలో ఉన్నాయి. వీటిని అష్ట వినాయక క్షేత్రాలు అని అంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలని అనుకునేవారు ఈ క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలాగే మహా పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది..

1. మయూరేశ్వర క్షేత్రం:
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న మయూరేశ్వర క్షేత్రంలో వినాయకుడు మయూర వాహనంపై కనిపిస్తాడు. ఇక్కడ మయూర పక్షి పై వివరిస్తూ మహారాక్షసుడు సింధును సంహరించాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం చుట్టూ ఎనిమిది గుమ్మాలు ఉంటాయి.

2. సిద్ధి వినాయక క్షేత్రం:
భీమా నది ఒడ్డున ఉన్న ఈ సిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. గణపతి సిద్ది ప్రసాదుడిగా ఇక్కడ పూజించబడతాడు. విష్ణు మహా శత్రువు అయిన మధు -కైటబులను సంహరించేందుకు గణపతిని పూజించాడని పురాణం తెలుపుతుంది.

3. బాలేశ్వర క్షేత్రం:
మహాగణపతి ఇక్కడ బాలదేవుడిగా దర్శనం ఇస్తాడు. అందుకే దీనికి బాలేశ్వర క్షేత్రం అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఆలయం బండరాయిలతో నిర్మాణం జరిగింది. ఇది పురాతన ఆలయం వలె ఆకట్టుకుంటుంది.

Also Read:  శివుడి ఆరాధనతో మీ జీవితంలో కలిగే గొప్ప మార్పులు ఇవీ

4. వరద వినాయక క్షేత్రం:
మహాడ్ గ్రామంలో ఉన్న ఈ ఆలయం లో ఉన్న వినాయకుడు భక్తులకు వరాలను ప్రసాదిస్తాడని పేర్కొంటారు.

5. చంద్ర వినాయక క్షేత్రం:
ఇక్కడ గణపతి చంద్రకార అలంకరణతో కనిపిస్తాడు. పృద్వి తల్లిని రక్షించేందుకు గణపతి చేసిన యజ్ఞ కథలో వరద వినాయకుడి ప్రస్తావన వస్తుంది.

6. గిరిజాత్మజ క్షేత్రం:
ఇక్కడ వినాయకుడు పర్వత గుహల్లో దర్శనమిస్తాడు. పార్వతీదేవి తపస్సు చేసి గణపతిగా కుమారుడిని పొందిన కథలు తెలుపుతూ గిరిజాత్మజ వినాయకుడిగా ఇక్కడ కనిపిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయానికి వెళ్లాలంటే 300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

7. విఘ్నేశ్వర క్షేత్రం:
విఘ్నసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత భక్తులకు విఘ్నాలను తొలగించేందుకు వినాయకుడు ఇక్కడ విగ్నేశ్వరుడిగా దర్శనం ఇస్తున్నాడని పురాణాలు తెలుపుతున్నాయి.

Also Read:  రోడ్డుమీద దొరికే ఈ మూడు వస్తువులను అస్సలు తీసుకోవద్దు..

8. మహాగణపతి క్షేత్ర:
మహా రాక్షసుడు త్రిపుర సురుడుని నాశనం చేయడంలో శివుడికి గణపతి సహాయం చేశాడని పురాణాల్లో చెప్పబడింది. ఆ తర్వాత మహాగణపతిగా భక్తులకు ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు.

ఇలా ఎనిమిది క్షేత్రాలు ఒకే రాష్ట్రంలో దర్శనం ఇస్తుంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular