Bigg Boss 9 Telugu Day 72: ఈ వారం బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) నుండి బయటకు ఎవ్వరు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్స్ లో పవన్ కళ్యాణ్,భరణి, డిమోన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్, సంజన మరియు దివ్య ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాప్ ఓటింగ్ తో ముందుకు దూసుకొని వెళ్తున్నాడు. దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. తనూజ నామినేషన్స్ లో ఉండుంటే ఆమెనే అందరికంటే టాప్ స్థానం లో ఉండేది, కానీ ఈ వారం కెప్టెన్ అవ్వడం వల్ల ఆమె నామినేషన్స్ లో లేదు. అంతే కాకుండా ఈమధ్య కాలంలో వీళ్లిద్దరు బాగా క్లోజ్ గా ఉండడం తో తనూజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ కి బాగా ఓట్లు వేస్తున్నారు. దీంతో అతను భారీ లీడింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఇక రెండవ స్థానం లో ఇమ్మానుయేల్ కొనసాగుతున్నాడు.
10 వారాల నుండి నామినేషన్స్ లో లేకుండా 11 వ వారం లో ఎదో పొరపాటున నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇన్ని వారాలు నామినేషన్స్ లో లేకుండా ఒక్కసారి నామినేషన్స్ లోకి వస్తే ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అవుతాడు. కానీ ఇమ్మానుయేల్ ఎవ్వరి ఊహలకు అందకుండా భారీ ఓటింగ్ తో ముందుకు సాగుతున్నాడు. అంటే ఇంత కాలం ఇమ్మానుయేల్ ఓటింగ్ ని సంజన కాపాడుతూ వచ్చింది అనుకోవచ్చు. ఇమ్మానుయేల్ నామినేషన్స్ లో లేకపోయినా, సంజన ప్రతీ వారం నామినేషన్స్ లో ఉంటూ వస్తోంది. కాబట్టి అతని ఓటు బ్యాంక్ మొత్తం సంజన కి ఇన్ని రోజులు పడుతూ వచ్చింది. ఇప్పుడు ఇమ్మానుయేల్ నామినేషన్స్ లోకి రావడం తో ఆయన ఓటింగ్ ఆయనకే పడింది. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో భరణి కొనసాగుతున్నాడు. గత వారం ఆయన ఆట తీరు బాగా మెరుగుపడడంతో పాటు, నామినేషన్స్ లో కూడా బలంగా తన స్వరం వినిపించడం తో భరణి కి భారీ ఓటింగ్ పడుతోంది.
అంతే కాకుండా తనూజ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ఆయనకు గట్టిగానే పడుతోంది. రీ ఎంట్రీ తర్వాత వీళ్లిద్దరి మధ్య అంత రిలేషన్ లేదు. తనూజ ఇతర కంటెస్టెంట్స్ తో మాట్లాడుతున్నట్టుగా భరణి తో అసలు మాట్లాడడం లేదు. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తనూజ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఆమె అభిమానులు ఈయనకు బలంగా ఓట్లు వేయడం తో మూడవ స్థానం లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానం లో డిమోన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ వారం డిమోన్ బాగా నెగిటివ్ అయ్యాడు. అందుకే అతనికి ఓటింగ్ బాగా తగ్గిపోయింది. ఇక చివరి రెండు స్థానాల్లో సంజన, దివ్య నిఖిత ఉన్నారు. ఇద్దరి మధ్య ఓటింగ్ తేడా పెద్దగా ఏమి లేదు. కాబట్టి ఈ వారం వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.