Bigg Boss 9 Telugu Suman Shetty Vs Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఆడియన్స్ కి బాగా ముఖ పరిచయం ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే, మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుమన్ శెట్టి. జయం సినిమాతో కమెడియన్ గా వెండితెర అరంగేట్రం చేసిన సుమన్ శెట్టి, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి,తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సొంతం చేసుకున్నాడు. ఈమధ్య కాలం లో పెద్దగా ఆయన కనిపించడం లేదు, అందుకే బిగ్ బాస్ 9 లోకి వచ్చాడు కానీ, హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి సుమన్ శెట్టి చాలా మౌనం గా, ఎవరితో కలవకుండా, అసలు ఎంటర్టైన్మెంట్ కూడా చేయకుండా, చాలా సైలెంట్ గా ఒక మూల కూర్చున్నాడు. భరణి లాంటోళ్ళు దగ్గరకు పిలిచి మాట్లాడితే మాట్లాడుతున్నాడే కానీ, తనకు తానుగా మాట్లాడుతున్నట్టు ఎక్కడా అనిపించలేదు.
Also Read: రీతూ తలని తొక్కేసిన తనూజ.. బాధపడాల్సింది పోయి రీతూ పై తనూజ చాడీలు!
అందుకే సుమన్ శెట్టి నామినేషన్స్ లోకి వచ్చాడు. ముందుగా రాము రాథోడ్ సుమన్ శెట్టి పేరు ని తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఉన్నోళ్లంతా కుర్రాళ్లు, మేమంతా టాస్కులు ఎలాంటివి పెట్టినా ఆడగలం, కానీ నువ్వు ఆడగలవో లేదో కాస్త అనుమానం గా ఉంది అన్నా, అందుకే నామినేట్ చేస్తున్న అంటాడు. ఆ తర్వాత సుత్తిని ఓనర్స్ లో ఒకరైన హరీష్ చేతికి ఇస్తాడు రాము. అప్పుడు హరీష్ మాట్లాడుతూ ‘మీరు ఎందుకో యాక్టీవ్ గా లేరు. హౌస్ లో టాస్కులు ఆడాలి, అందరితో కలవాలి అనేది మీలో కనిపించడం లేదు. మీరు చాలా మంచి వారు,నాకు అది అర్థమైంది కానీ, ఈ హౌస్ గేమ్ ఫార్మటు కి మీరు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నాను’ అని చెప్తాడు. అప్పుడు సుమన్ శెట్టి ‘అంటే షో మొదలై రెండు రోజులు కూడా అవ్వలేదు కదండీ. అందరితో మింగిల్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. నేను అందరితో మంచిగానే మాట్లాడుతున్నాను కదా, ఇంకేమి కావాలి’ అని అంటాడు సుమన్ శెట్టి.
అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడుతూ ‘మీలో గేమ్ ఆడాలి అనే కసి,ఎనర్జీ కనపడట్లేదు అంటున్నా’ అని అంటాడు. అప్పుడు సుమన్ శెట్టి సరే అండీ అని చెప్పి ఊరుకుంటాడు. ఇంకా మీరేమైనా పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నారా అని హరీష్ అడగ్గా, ఏమి లేదండీ అని అంటాడు సుమన్ శెట్టి. అప్పుడు సంజన మధ్యలో కల్పించుకొని, మీకు ఏదైనా పాయింట్స్ ఉంటే చెప్పండి అని అంటుంది. ‘నాకు వినపడింది..తెలుగు లోనే అతను చెప్పాడు. నాకు తెలుగు వచ్చు’ అని ముఖం మీద ఫాట్ మని కొట్టినట్టు సమాధానం చెప్పాడు. దెబ్బకు సంజన నోరు మూసుకుంటుంది. చూసే ఆడియన్స్ కి కూడా ఈ పంచ్ తెగ నచ్చేసింది. పర్లేదు సుమన్ శెట్టి లో మ్యాటర్ ఉంది, బయటపడుద్ది త్వరలో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.