Bigg Boss 9 Telugu Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో మొదటి ఎపిసోడ్ నుండే ఊహించని ట్విస్టులను చూస్తూనే ఉన్నాం. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి ఇమ్మానుయేల్ మరియు రాము రాథోడ్ తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో అందరికంటే టాప్ ఓటింగ్ తనూజ కొనసాగుతుండగా, ఆమె తర్వాతి స్థానం లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు. తనూజ చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఇదొక్కటే ఆమెలో పాజిటివ్, అంతే కానీ ఇప్పటి వరకు ఆమె ఎలాంటి గేమ్ కూడా ఆడలేదు. ఎంతసేపు నాన్న నాన్న అంటూ భరణి ని ఎమోషనల్ టార్చర్ చేయడం తప్ప, హౌస్ లో ఆమె నుండి ఎంటర్టైన్మెంట్ రావడం లేదు, మరో వైపు మంచి కంటెంట్ కూడా రావడం లేదు. అయినప్పటికీ ఆమె టాప్ 1 స్థానం లో కొనసాగడం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ ఈమధ్యనే తన ఆట తీరుని మార్చుకున్న సంగతి తెలిసిందే.
అగ్నిపరీక్ష షోలో ఈయన్ని అందరూ ఇష్టపడ్డారు, కానీ మొదటి మూడు వారాలు గేమ్ లేకపోవడం తో ఆడియన్స్ ఇతన్ని డేంజర్ జోన్ లోకి నెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆట తీరు మార్చుకోవడం తో టాప్ 2 లో పెట్టారు. ఇక ఓటింగ్ లో మూడవ స్థానం లో సుమన్ శెట్టి కొనసాగుతుండగా, నాల్గవ స్థానం లో సంజన కొనసాగుతుంది. ఇమ్మానుయేల్ నామినేషన్స్ లో లేకపోవడం కూడా సంజన కి బాగా కలిసొచ్చింది. ఇక ఐదవ స్థానం లో భరణి, శ్రీజ దమ్ము సరిసమైనమైన ఓట్లతో కొనసాగుతున్నారు. భరణి టాప్ 2 లో ఉండాల్సిన కంటెస్టెంట్, కానీ బంధాల మధ్య నలిగిపోతూ తన కోసం గేమ్ ఆదుకోకుండా, ఇతరుల కోసమే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆయన గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. ఇక శ్రీజ 5వ స్థానం లో ఉండడం నిజంగా సర్ప్రైజ్.
తన ప్రవర్తన తో పాటు, ఆట తీరు ని కూడా బాగా మార్చుకోవడం తో ఈమెను టాప్ 5 లో పెట్టారు ఆడియన్స్. ఇక హౌస్ లో ఏ టాస్క్ ఆడకపోయినా కూడా ఫ్లోరా షైనీ ఆరవ స్థానం లో కొనసాగుతుండగా, రీతూ చౌదరి 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇక చివరి రెండు స్థానాల్లో దివ్య నిఖిత, డిమోన్ పవన్ ఉన్నారు. వీళ్లిద్దరు టాస్కులలో అద్భుతంగా ఆడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆడియన్స్ వీళ్ళను గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. వీళ్ళతో పాటు రీతూ చౌదరి కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఈ ముగ్గురుకి సమానమైన ఓట్లు పడుతున్నాయి. కచ్చితంగా వీరిలో ఇద్దరు ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. ఫ్లోరా షైనీ ని ఉందిస్తూ, బోలెడంత కంటెంట్ ఇస్తున్న ఈ ముగ్గుర్లో ఇద్దరినీ బయటకు పంపితే మాత్రం బిగ్ బాస్ టీం పెద్ద పొరపాటు చేసినట్టే, ఏమి అవ్వుదో చూడాలి మరి.