Baahubali The Epic Advance Bookings: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ‘కాంతారా 2′(Kantara: The Chapter 1) చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియర్స్ నుండే ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ ఆ టాక్ కి తగ్గ కలెక్షన్స్ మాత్రం ఓవర్సీస్ నుండి రావడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో అయితే బయ్యర్ కి చావు దెబ్బ తప్పేలా లేదు. 9 మిలియన్ డాలర్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేస్తే 5 రోజులకు కలిపి కనీసం మూడు మిలియన్ డాలర్లు కూడా రాలేదు. పరిస్థితి ఎలా ఉందంటే అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్ గా అన్ని స్క్రీన్ ఫార్మట్స్ లో విడుదల కాబోతున్న ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali: The Epic) రీ రిలీజ్ కి కూడా ‘కాంతారా 2’ కంటే ఎక్కువగా ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేలా అనిపిస్తున్నాయి.
నిన్ననే ‘బాహుబలి : ది ఎపిక్’ కి సంబంధించి 65 షోస్ కి గానూ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఈ 65 షోస్ నుండి పది వేల డాలర్లు వచ్చాయి. బాహుబలి సిరీస్ విడుదల సమయం లో ఇన్ని రకాల స్క్రీన్ ఫార్మట్స్ లేవు కాబట్టి, రాజమౌళి ఈ చిత్రాన్ని ఐమాక్స్, డి బాక్స్,4Dx, EpiQ, ఐస్, డాల్బీ విజన్ ఇలా ప్రపంచం లో ఎన్ని ఫార్మటు స్క్రీన్స్ ఉన్నాయో అన్నిట్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. బాహుబలి లాంటి గ్రాండియర్ ఎపిక్ ని ఈ స్క్రీన్స్ మీద చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు కాబట్టి, దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఊపు చూస్తుంటే నార్త్ అమెరికా లో మొదటి రోజు 1 మిలియన్ కి పైగా డాలర్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ‘కాంతారా 2’ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి కూడా ఈ రేంజ్ గ్రాస్ రాలేదు.
బాహుబలి సిరీస్ రెండు భాగాలు కలిపి 3 గంటల 45 నిమిషాల ఎడిట్ ని రెడీ చేశారట. ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని కొంత కొత్త కంటెంట్ ని కూడా జత చేశారట. ఓవరాల్ గా ఒక కొత్త సినిమాని చూసే అనుభూతిని కలిగించేందుకు రాజమౌళి చాలా గట్టిగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ చిత్రం ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ మొత్తం ‘కాంతారా 2’ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఒకపక్క మహేష్ మూవీ సినిమా చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న రాజమౌళి, బాహుబలి రీ రిలీజ్ కి ఇంత శ్రద్ద చూపించడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.