Bigg Boss 9 Telugu: ఈసారి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఓటింగ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. గత సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ఆడియన్స్ కి వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యేవారు. అలా ఈ సీజన్ లో ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయినా వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తనూజ కి ఓటింగ్ వేరే లెవెల్ లో పడుతుంది కానీ, అది బిగ్ బాస్ హౌస్ వల్ల వచ్చిన క్రేజ్ కాదు, మొదటి నుండి ఆమెకు అదే రేంజ్ ఓటింగ్ ఉంది. ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన వారిలో తనూజ కూడా ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ప్రస్తుతం తనూజ ట్రిపుల్ మార్జిన్ ఓట్లతో నెంబర్ 1 స్థానం లో ఉంది. ఆ తర్వాతి స్థానం లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు. మూడవ వారం లో డేంజర్ జాయిన్ లోకి వచ్చినా పవన్ కళ్యాణ్, రెండు వారాల నుండి టాస్కులు అద్భుతంగా ఆడుతూ రావడం తో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
ఇక వీళ్లిద్దరి తర్వాత మూడవ స్థానం లో సంజన కొనసాగుతుంది. ఈ వారం ఈమె అందరి అంచనాలను అధిగ మించి అద్భుతంగా గేమ్స్ అన్ని ఆడుతూ వచ్చింది. కేవలం టాస్కులు ఆడడం మాత్రమే కాదు, బోలెడంత ఫన్ మరియు కంటెంట్ ఇస్తుంది. అందుకే ఆడియన్స్ ఈమెని టాప్ 3 లో కూర్చోబెట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, ఇక్కడి నుండి మాత్రం ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఆడియన్సు తీర్పు కూడా అదే విధంగా ఉన్నది. ఏ సీజన్ లో అయినా డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు నుండి ముగ్గురు ఉండేవారు. కానీ ఈ వారం ఏకంగా 7 మంది కంటెస్టెంట్స్ డేంజర్ వన్ లో ఉన్నారట. బిగ్ బాస్ చరిత్ర లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.
ఈ 7 మంది కంటెస్టెంట్స్ కి మధ్య ఓటింగ్ తేడా కేవలం ఒకే ఒక్క శాతం ఉందట. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి, వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే హౌస్ లో ఓటింగ్ ప్రకారం ఈ ఏడుగురు కంటెస్టెంట్స్ ఏయే సాహనాల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. సుమన్ శెట్టి నాల్గవ స్థానం లో కొనసాగుతుంటే, దమ్ము శ్రీజ ఐదవ స్థానం లోనూ, భరణి ఆరవ స్థానం లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత ఫ్లోరా, డిమోన్ పవన్, దివ్య మరియు రీతూ చౌదరి..ఈ నలుగురికి సరిసమానమైన ఓటింగ్ పడుతుందట. చూసుకొని మీ అభిమాన కంటెస్టెంట్ ఓటు వేసుకోండి మరీ. అయితే ప్రస్తుతం జరుగుతున్నా ఇమ్యూనిటీ టాస్క్ లో ఏ జంట గెలిచి నామినేషన్స్ నుండి బయటపడుతారో చూడాలి.