Bigg Boss 9 Telugu Tanuja saves Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఊహించని ట్విస్టులు ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. గత వారం లో జరిగిన టాస్కులు ఆడియన్స్ కి బాగా బోర్ కొట్టించాయి కానీ, అంతకు ముందు వారాలు మాత్రం చాలా బలంగానే నడిచాయి. ఈ సీజన్ కి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని రప్పించేలా చేశాయి. ఇప్పటికీ ఈ సీజన్ టాప్ రేటింగ్ తోనే కొనసాగుతోంది, కానీ గత వారం లాగానే ఈ వారం కూడా ఉంటే భారీగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో సంజన ని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపి సీక్రెట్ రూమ్ లో పెట్టడం, ఆ తర్వాత ఆమెని శనివారం ఎపిసోడ్ లో స్టేజి మీదకు తీసుకొచ్చి, హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేస్తే సంజన మళ్లీ లోపలకు వస్తుంది అని నాగార్జున చెప్పడం వంటివి గత సీజన్స్ లో ఎప్పుడూ కూడా జరగలేదు.
Also Read: హౌస్ లోకి వరుసగా ఎంట్రీ ఇస్తున్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్..షాక్ లో హౌస్ మేట్స్!
అయితే సంజన కోసం తనూజ కాఫీ త్యాగం చేయడం, ఇమ్మానుయేల్ కెప్టెన్సీ ని త్యాగం చేయడం, భరణి తనకు సెంటిమెంట్ గా భావించిన లాకెట్ ని తిరిగి పంపేయడం, రీతూ చౌదరి జుట్టు కత్తిరించుకోవడం వంటివి జరిగాయి. ఈ వారం జరిగిన నామినేషన్స్ లో కూడా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా డేంజర్ జోన్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ సంజన మరియు రమ్య. వీళ్లిద్దరి మధ్యనే ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో గోల్డెన్ బజర్ టాస్క్ లో తనూజ గెలిచి, గోల్డెన్ బజర్ ని సొంతం చేసుకుంది. దీంతో ఒకరిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయొచ్చు. తనూజ దీన్ని ఉపయోగించి సంజన ని సేవ్ చేసింది. దీంతో రమ్య ఎలిమినేట్ అయ్యింది. సంజన ని రెండవసారి కూడా తనూజ కాపాడింది.
కనీసం సంజన ఇప్పుడైనా ఆమె పట్ల విశ్వాసం తో ఉంటుందా?, లేకపోతే నువ్వు చేసింది అసలు త్యాగమే కాదంటూ తీసి పారేస్తోందా? అనేది రాబోయే రోజుల్లో చూడాలి. గత వారం లో ఆమె తనూజ తో గొడవ పెట్టుకున్నప్పుడు, తనూజ ‘అనవసరంగా బయటకి వెళ్లిపోయే ఆమెని లోపలకు తీసుకొచ్చాను త్యాగం చేసి, నాకు బుద్ధి లేదు’ అని అంటుంది. అందుకు సంజన ‘నువ్వేమి త్యాగం చేయలేదు. నాలుగు రోజులకే మళ్లీ కాఫీ తాగావు. ఆ రోజు నువ్వు చేసింది మొత్తం కెమెరాల కోసమే, నిజమైన త్యాగం చేసింది రీతూ, నాకోసం జుట్టు కత్తిరించుకుంది, అందుకు నేను సెల్యూట్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు చాలా చీప్ గా అనిపించాయి. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఈ విషయాన్నీ కూడా కవర్ చేసుంటే బాగుండేది అని అనిపించింది.