Bigg Boss 9 Telugu Nagarjuna: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరినీ ఉతికి ఆరేసిన తీరు అద్భుతం అనిపించింది. సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకునే అంశాలను, రివ్యూయర్స్ లేవదీసిన పాయింట్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన హోస్టింగ్ చేసాడేమో అని అనిపిస్తోంది. ముఖ్యంగా నోరు అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడే దివ్వెల మాధురి, సంజన లకు వేరే లెవెల్ లో క్లాస్ పీకాడు. ‘మీరు తోపులు అయితే బయట చూసుకో అమ్మా..ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అందరూ ఒక్కటే’ అని చెప్పిన విధానం ఏదైతే ఉందో శభాష్ అనిపించింది. కానీ రీతూ చౌదరి విషయం లో ఒక చిన్న పొరపాటు చేసాడు. ‘బయట అయ్యుంటే క్రింద పడేసి కొట్టేదానిని’ అని మాధురి మాట్లాడడం తప్పు అని చాలా గట్టిగా అయితే నాగార్జున చెప్పగలిగాడు కానీ, ఆమె ఏమి మాట్లాడిన పడాలి, నువ్వు గొంతు లేపకుండా ఉండుంటే అంత గొడవ అయ్యేది కాదంటూ రీతూ చౌదరి ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అనిపించింది.
Also Read: హౌస్ లోకి వరుసగా ఎంట్రీ ఇస్తున్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్..షాక్ లో హౌస్ మేట్స్!
ఇక సంజన ప్రవర్తన కి చూసే ఆడియన్స్ కి కూడా ఈమధ్య చిర్రెత్తిపోతోంది. ఆమె చేసే ప్రతీ పని క్యూట్ అని అనుకుంటుంది, ఇష్టమొచ్చిన విధంగా నోరు పారేసుకుంటుంది, సెన్సిటివ్ అంశం అనేది కూడా ఆమె చూడడం లేదు, తనూజ, కళ్యాణ్, నిఖిల్ ని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు ఒక ఆడపిల్ల పరువు ని తీసినట్టుగా అనిపించింది. దీనిని పై కూడా నాగార్జున మాట్లాడడం హర్షణీయం. దివ్య ని రోడ్ రోలర్ తో పోల్చడం, సుమన్ శెట్టి ని వరస్ట్ కెప్టెన్ అని అనడం, ఇలా ఒక్కటా రెండా ఎన్నో లూజ్ మాటలు వదిలేసింది. ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం, మళ్లీ అవే మాటలు మాట్లాడడం, సంజన కి ఇది అలవాటు అయిపోయింది. బలమైన శిక్ష పడితే తప్ప ఆమె సెట్ అవ్వదు అనే అభిప్రాయం ఆడియన్స్ లో కూడా ఉంది.
ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఆమెకు వారం మొత్తం మాట్లాడకూడదు అనే శిక్ష విధించినట్టు టాక్. ఇక తనూజ తన టీం తో మాట్లాడుతున్నప్పుడు రాము మధ్యలో వచ్చి కూర్చోవడం, అందుకు ఆమె చిరాకు పడుతూ పైకి లేచి వెళ్లిపోవడం వంటివి గత వారం లో పెద్ద నెగిటివిటీ ని తెచ్చిపెట్టింది. ఈ వీడియో ని కూడా ప్లే చేసి నాగార్జున తనూజ ని నిలదీసిన విధానం బాగుంది. దానికి తనూజ క్లారిటీ ఇవ్వడం, ఆ తర్వాత నాగార్జున రాము ని అడుగుతూ ‘నీకు ఏమని అనిపించింది ఆ సమయంలో?’ అని అనడం, నాకు ఏమి అనిపించలేదు సార్, నాకు అలా కూర్చోవడం అలవాటు, పైకి లేచి వెళ్లిపోవడం కూడా వాళ్లకు అలవాటు, కాబట్టి నేనేమి ఫీల్ అవ్వలేదు అంటూ చెప్పొచ్చిన విధానం బాగుంది. ఓవరాల్ గా ఎపిసోడ్ లో నాగార్జున సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయానికి తగ్గట్టుగా హోస్టింగ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇలాగే కొనసాగితే సీజన్ మరో లెవెల్ కి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.