Bigg Boss 9 Telugu Ticket Finale Race: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో 13వ వారం లోకి అడుగుపెట్టేసింది. ఈ 13 వారాలు ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యినంతగా, ఏ సీజన్ కి కూడా అవ్వలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంధాలు, అనుబంధాలు అంటూ ఒక టీవీ సీరియల్ ని చూస్తున్న ఫీలింగ్ కలిగించడం తో ఈ సీజన్ ని బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచారు ఆడియన్స్. కానీ యూత్ ఆడియన్స్ మాత్రం ఎందుకో ఈ సీజన్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. అందుకు కారణం సీరియల్ ఫీలింగ్ అనిపించడమే. అయితే ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్కులు హోరాహోరీగా జరగనున్నాయి. నేడు జరగబోయే టాస్కులకు సంబంధించిన ప్రోమోలను మీరంతా చూసే ఉంటారు. మొదటి ప్రోమో టాస్క్ లో ఇమ్మానుయేల్, రీతూ చౌదరి మరియు పవన్ కళ్యాణ్ తలపడుతారు.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
ఈ పోటీలో ఇమ్మానుయేల్ గెలుస్తాడట. అదే విధంగా రెండవ ప్రోమో టాస్క్ లో ఇమ్మానుయేల్ సంజన ని ఎంచుకొని ఆడుతాడు. ఇందులో కూడా ఇమ్మానుయేల్ గెలుస్తాడట. ఇక మూడవ ప్రోమో టాస్క్ లో తనూజ, భరణి, డిమోన్ పవన్ ఆడడం మనమంతా చూసాము. ఈ టాస్క్ లో తనూజ గెలిచింది అట. కానీ ఆమె గెలుపు వెనుక చాలా డ్రామా క్రియేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పైన నుండి పడే పూలను ఎంచుకొని దూరం గా ఏర్పాటు చేసిన మడ్ పిట్ లో నాటాలి. ఈ టాస్క్ లో తనూజ డిమోన్ పవన్ తో ఏ రేంజ్ లో కొట్లాడుతుందో మనమంతా చూసాము. ఆ ప్రోమో ని చూస్తుంటే భరణి, తనూజ కలిసి డిమోన్ పవన్ మీద అటాక్ చేసినట్టుగా అనిపించింది. అంతే కాకుండా డిమోన్ పవన్ పై తనూజ అనవసరంగా అరిచినట్టుగా కూడా అనిపించింది. ఇక రెండవ టాస్క్ లో ఎవరితో ఆడాలో ఎంచుకోమని బిగ్ బాస్ తనూజ కి చెప్పగా, ఆమె చాలా సేఫ్ గా సుమన్ శెట్టి ని ఎంచుకుంది.
ఎందుకంటే అతనితో అయితే చాలా తేలికగా గేమ్ గెలవొచ్చు అనే ప్లాన్ అన్నమాట. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ టాస్క్ లో తనూజ ఓడిపోయింది, సుమన్ శెట్టి గెలిచాడు. ఇక్కడ కూడా తనూజ పెద్ద సీన్ క్రియేట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అనవసరంగా ఆమె అరవడం, ఆమె గేమ్ కి చాలా మైనస్ అయ్యేలా అనిపిస్తుంది. గత రెండు వారాల నుండి ఆమె గ్రాఫ్ భారీగా పడిపోయింది. మొదటి స్థానం లో ఉన్న ఆమె ఇప్పుడు రెండవ స్థానం లోకి పడిపోయింది. ఇదే తరహా ప్రవర్తన కొనసాగిస్తూ పోతే ఆమెకు రెండవ స్థానం దక్కడం కూడా అనుమానమే. ఈరోజు ఆమె ఒక టాస్క్ గెలిచినప్పటికీ కూడా, ఆమెకు నెగిటివ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.