Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, కచ్చితంగా టైటిల్ ని గెలిచేంత సత్తా ఉంది అని నిరూపించుకున్న వారిలో ఒకరు భరణి. ఆయన హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తోపు ప్లేయర్, కుర్రాళ్లతో కూడా పోటీ పడి అద్భుతంగా ఆడగలడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన హౌస్ లో బంధాలలో చిక్కుకొని తన ఆట ని మొత్తం చెడగొట్టుకుంటున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ బంధాల కారణంగా భరణి గ్రాఫ్ ప్రతీ వారం తగ్గిపోతూ వస్తుంది. ఇలాగే కొనసాగితే ఆయన టాప్ 5 వరకు రావడం కూడా కష్టమే. ఇప్పటికే తనూజ, దివ్య లను తన కూతుర్లుగా, సుమన్ శెట్టి , రాము రాథోడ్ వంటి వారిని తన తమ్ముల్లుగా భావిస్తున్నాడు భరణి. వీరితో పాటు రీతూ చౌదరి, సంజన, ఇమ్మానుయేల్ వంటి వారితో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉన్నది.
ఇంతమంది తో రిలేషన్ లో ఉండడం వల్ల భరణి గేమ్ చెడిపోవడమే కాకుండా, ఆయన కారణంగా ఎదుటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకు నిన్నటి టాస్క్ లో భరణి టీం టాప్ పాయింట్స్ తెచ్చుకోవడం తో బిగ్ బాస్ వాళ్లకు ఒక టీం ని గేమ్ నుండి తప్పించే పవర్ ని ఇస్తాడు. న్యాయంగా అయితే అందరికంటే తక్కువ పాయింట్స్ ఉన్నటువంటి సుమన్ టీం ని ఎలిమినేట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ మొదటి టాస్క్ నుండి అద్భుతంగా ఆడుతూ వచ్చినా సంజన, ఫ్లోరా టీం ని ఎలిమినేట్ చేస్తాడు. కారణం సుమన్ కోసమే. ఈ విషయాన్నీ స్వయంగా భరణి నే ఒప్పుకున్నాడు. సుమన్ కోసం ఒక టీం ని అన్యాయం గా తొక్కేసాడు అనే పేరొచ్చింది. ‘నాచోరే టాస్క్’ లో అయితే ఏకంగా తన కూతురుగా పిలవబడే తనూజ టీం కి దెబ్బ తియ్యాలని చూసాడు.
రీతూ చౌదరి టీం తో చేతులు కలపడం, అందుకోసం తన టీం మేట్ అయినటువంటి కళ్యాణ్ ని ఓడించాలని భరణి చూడడం, దీనిని గమనించిన తనూజ మీ కోసం ఆడండి, అవతల వాళ్ళ కోసం ఆడొద్దు అని గట్టిగా అరుస్తుంది. రీతూ చౌదరి టీం తో చేతులు కలిపినా మీరు, నాతో ఎందుకు చేతులు కలపలేదు? అనేది తనూజ లో ఉన్న ఆవేదన. అందుకే ఆమె నిన్న భరణి తో మాట్లాడడం మానేసింది. చివరికి ఆయన చేతుల మీదుగా అన్నం వడ్డించుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. దీనికి భరణి చాలా హర్ట్ అవుతాడు. ఇక్కడ భరణి తో వచ్చే సమస్య ఏమిటంటే, ఎవరైనా తన్న వద్దకు వచ్చి ఏదైనా డీల్ పెడితే ముందు వెనుక ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నాడు. ఈ కారణం చేతనే అందరూ ఆయన్ని హౌస్ లో అపార్థం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన హౌస్ లో ఏకాకి గా మిగిలే అవకాశాలు కూడా ఉన్నాయి.