Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఎంతటి ఫైర్ వాతావరణం మధ్య కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. హౌస్ లో జరిగే టాస్కులకంటే ఎక్కువగా వాళ్ళ మధ్య జరిగే గొడవలే ఆడియన్స్ కి ఆసక్తి గా అనిపిస్తుంది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా రోజురోజుకి భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే ఈ సీజన్ పైకి లేవడానికి మొట్టమొదటి కారణం సంజన. ఈమె లేకపోతే కొన్ని సంఘటనలు జరిగేవి కావు, దానికి హౌస్ మొత్తం షేక్ అయ్యేది కూడా కాదు. బోలెడంత కంటెంట్ ని ఆమె మొదటి ఎపిసోడ్ నుండే ఇవ్వడం ప్రారంభించింది. ఆ కంటెంట్ బాగుంది, జనాలకు నచ్చింది అనే విషయం, బిగ్ బాస్ ఆమెని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆమెకు స్పష్టంగా అర్థం అయ్యింది. ఇక అప్పటి నుండి అదే తరహా లో తనకు నచ్చిన విధంగా ఉంటూ, చేయాలనిపించింది చేస్తూ ముందుకు పోతుంది.
కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కానీ, కొన్ని మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మరీ ఇంత తక్కువ స్థాయికి దిగజారాలా?, ఇది కరెక్ట్ కాదని చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ అందుకు ఒక ఉదాహరణ. ఒక చిన్న పోపు కోసం ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇందులో తనూజ తప్పు కూడా ఉంది, కానీ అంత పెద్ద గొడవ చెయ్యాల్సిన విషయం అయితే కాదు. టిఫిన్ తయారు చేసే సమయం లో తనకు కాస్త పోపు కావాలని కెప్టెన్ డిమోన్ పవన్ ని అడుగుతుంది. ఫుడ్ మానిటర్ తనూజ తో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోండి అని డిమోన్ పవన్ అంటాడు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. తనూజ ఆమె అడిగిన వెంటనే అడ్డు చెప్పకుండా చేసి ఉంటే అయిపోయేది. కానీ ఆమె చిరాకు పడుతూ మాట్లాడడం తో సంజన కి బాగా కోపం వచ్చేసింది. ఇల్లు పీకి పందిరి వేసింది.
తనూజ ని ఫుడ్ మానిటర్ పదవి నుండి తీసే వరకు ఆమె శాంతించలేదు. అంతసేపు ఒంటికాలు మీద లేచి గొడవలు చేసిన సంజన, తనకు ఫుడ్ మానిటర్ పదవి ఇస్తానని చెప్పిన వెంటనే చాలా కూల్ అయిపోయింది. అంటే ఈ పదవి కోసమే ఆమె ఇంత పెద్ద గొడవ చేసిందా?, అని చూసే ప్రతీ ఒక్కరికి అనిపించింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే తనూజ కి కాఫీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క రోజు కాఫీ లేకపోతే ఆమె బుర్ర పాడైపోతుంది. అంత ఇష్టమైన కాఫీ ని సంజన హౌస్ లోపలకు అడుగుపెట్టడం కోసం త్యాగం చేసింది. దానిని నిన్న కోపంలో సంజన అదొక త్యాగమా? అంటూ తక్కువ చేసి మాట్లాడడం అసలు నచ్చలేదు. ఇది ఎపిసోడ్ లో చూపించలేదు కానీ, లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది.