Bigg Boss 9 Telugu Tanuja: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) రియాలిటీ షో లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ షోలో బాండింగ్స్ ని పెంచుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరో ఒక్కరు మాత్రమే ట్రోఫీ గెలుస్తారు, ఒకరిని ఒకరు ఎదో ఒక సందర్భం లో నామినేషన్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతాయి. అప్పుడు చూసేందుకు వెన్నుపోటు పొడుస్తున్నట్టుగానే అనిపిస్తాది. ఇప్పుడు తనూజ విషయం లో కూడా అదే జరుగుతుంది. ఈమె హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి భరణి తో ఎంత కనెక్షన్ పెంచుకుందో మనమంతా చూశాము. నాన్న, నాన్న అని పిలుస్తూ అతనితో చాలా క్లోజ్ గా నడుచుకుంది. భరణి కూడా ఆమెకు గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దివ్య మధ్యలో వచ్చి, భరణి కి బాగా క్లోజ్ అయ్యిందో, అప్పటి నుండి తనూజ, భరణి కి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.
తనూజ నాన్న తనతో ఉండడం లేదని ఎన్నో సందర్భాల్లో బాధపడుతూ ఏడ్చింది. కానీ భరణి మాత్రం ఆమెతో బాగానే ఉన్నాడు, ఆమెకు అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తూనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆమె వెనుక చేరి ఒక్కటంటే ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. కానీ వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఆమె బాగా మారిపోయింది. భరణి కి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఆయన్ని నాన్న అని పిలవడం కూడా మానేసి భరణి సార్ అని అంటుంది. ఇంతలా మారిపోవడం అందరినీ షాక్ కి గురి చేసే విషయమే. అయితే ఇన్ని రోజులు నాన్న అని పిలవడం మొత్తం డ్రామా యేనా అని చూసే ఆడియన్స్ కి కూడా అనిపిస్తుంది. పోనీ దూరం గా ఉండడం లో కూడా తప్పు లేదు, కానీ వెనుక చేరి ఆయన గురించి తప్పుగా మాట్లాడడం మాత్రం చాలా అన్యాయం. రాము పేరుకి మాత్రమే కెప్టెన్ అని, కానీ అతన్ని మొత్తం నడిపిస్తున్నది భరణి సార్ అని, అతని మైండ్ ని ఎన్నో సందర్భాల్లో కంట్రోల్ చేసాడని, వైల్డ్ కార్డ్స్ ముందు తప్పుగా మాట్లాడుతుంది.
అందరికి ఒక రూల్, భరణి మాత్రం ఒక రూల్ అన్నట్టుగా రాము వ్యవహరించాడని, మేము ఇంట్లోకి అడుగుపెడితే ఎందుకు లోపలకు వచ్చారు అని రాము అడుగుతాడు, కానీ భరణి సార్ మిల్క్ షేక్ చేసుకుంటూ లోపల కూర్చున్నాడు, ఆయన పక్కనే దివ్య జెడలు సర్దుకుంటూ కూర్చుంది, ఇద్దరు కలిసి గంటల తరబడి కూర్చున్నారు, రాము ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ కంటెస్టెంస్ట్స్ అందరికీ చెప్తుంది. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని నామినేషన్స్ సమయం లోనే చెప్పొచ్చు, కానీ అప్పుడు చెప్పకుండా, వెనుక చేరి ఇంత మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఇక్కడ ఆమెకు వచ్చిన సమస్య ఏమిటంటే దివ్య, భరణి లోపల అంతసేపు కూర్చొని మాట్లాడడం లాగా అనిపించడం లేదు, వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి భరించలేక మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ నిన్నటి ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ చెప్పుకొచ్చారు.