Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఓటింగ్ గ్రాఫ్స్ మారిపోవడానికి ఒకే ఒక్క ఎపిసోడ్ చాలు. ఆడియన్స్ అభిప్రాయం మారిపోవడానికి కూడా ఒకే ఒక్క ఎపిసోడ్ చాలు. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి తీసుకెళ్లింది ఒక్క ఎపిసోడ్ మాత్రమే. మొదటి మూడు వారాలు అసలు అతను గేమ్ ఆడడం లేదు, ఎంతసేపు అమ్మాయిలతో పులిహోర కలపడానికి అతనికి సమయం అయిపోతుంది, ఇలా అయితే కష్టం, తొందరగా ఎలిమినేట్ అయిపోతాడని అంతా అనుకున్నారు. డేంజర్ జోన్ లోకి కూడా వచ్చాడు, కానీ ఆ తర్వాత రోజు నుండి ఆయన ఆడిన ఆటలకు ఒక్కసారిగా గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు టైటిల్ రేస్ లో ఉన్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్ లోకి భరణి మరియు ఆయన ఇద్దరు కూతుర్లు వచ్చారు. తనూజ కి ఎన్ని నెగిటివ్ ఎపిసోడ్స్ పడినా ఆమె గ్రాఫ్ ఇసుమంత కూడా తగ్గడం లేదు.
ఆడియన్స్ కేవలం ఆమె అందాన్ని చూసి ఓట్లు వేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ, నెంబర్ 1 స్థాయిలో ఓట్లు పడే విధంగా ఆమె ఆట అయితే లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం కూడా ఆమెనే టాప్ స్థానం లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆమె తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టే, భరణి తో సహా. రెండు వారాల క్రితం భరణి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా కొనసాగేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఈ వారం ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత తక్కువ మార్జిన్ లో ఉన్నారు డేంజర్ జోన్ లో ఉన్నవాళ్ళంతా. శ్రీజ దమ్ము ని గత వారం లో అంత దారుణంగా క్రిందకి పడేసినప్పటి నుండి భరణి గ్రాఫ్ పడిపోయింది. ఆ ఒక్క ఎపిసోడ్ ఆయన తలరాతని మార్చేసింది.
ఆడవాళ్ళతో ఎంతో మర్యాదగా నడుచుకునే భరణి, ఇలా మాట్లాడుతున్న సమయం లో ఒక అమ్మాయిని విసిరి క్రిందకు పడేయడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఇక ఓటింగ్ విషయంలోకి వస్తే తనూజ కి తప్ప, అందరికీ దాదాపుగా ఒక్క శాతం తేడా తో సమానమైన ఓటింగ్ పడుతుంది. చివరి రెండు స్థానాల్లో రాము రాథోడ్, దివ్య ఉన్నారు. వీళ్లిద్దరిలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. అలా కాకుండా ఆడియన్స్ ఓట్లతో పని లేకుండా, గత వారం లో లాగా శ్రీజ ని ఎలిమినేట్ చేసినట్టు, ఈ వారం సుమన్ శెట్టి ని ఎలిమినేట్ చేసే ప్లాన్ కూడా పెట్టుకున్నాడేమో బిగ్ బాస్ చూడాలి. ఇదంతా పక్కన పెడితే తనూజ నెమ్మదిగా భరణి ని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. నిన్న మొన్నటి వరకు భరణి నాన్న అంటూ పిలిచి, ఇప్పుడు ఆయన వెనుక చేరి తప్పుగా మాట్లాడడం వంటివి చూస్తుంటే, ఆమె గ్రాఫ్ కూడా ఒక్కసారిగా అమాంతం పడిపోయే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.