Bigg Boss 9 Telugu : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన శివ(Siva Movie) చిత్రాన్ని ఈ నెల 14 న మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్ మొత్తం కదిలొచ్చింది. దాదాపుగా అందరూ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా వీడియో బైట్స్ కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ కి కూడా ఇలా జరగలేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఆరోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సునామీ ఎలాంటిది అనేది. నాగార్జున కూడా ఈ రీ రిలీజ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన కొత్త సినిమాలను కూడా ఈ రేంజ్ లో ఎప్పుడూ ఆయన ప్రమోట్ చేసుకోలేదు. కేవలం నాగార్జున మాత్రమే కాదు, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ గా నటించిన నాగార్జున సతీమణి అమల కూడా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు.
మరికాసేపట్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఎపిసోడ్ లో కూడా శివ మూవీ ప్రొమోషన్స్ జరిగింది. అల్ట్రా మాస్ లుక్ తో నాగార్జున ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత అమల, రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇవ్వడం వంటివి మొదటి ప్రోమో సాంగ్ లో మనం చూడొచ్చు. ఇక ఎపిసోడ్ మొదలు అయ్యే ముందు కంటెస్టెంట్స్ అందరి చేత శివ మూవీ లోని సాంగ్స్ తో స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేయించారు బిగ్ బాస్ టీం. తనూజ, పవన్ కళ్యాణ్ ఒక జంటగా, ఆ తర్వాత దివ్య, ఇమ్మానుయేల్ మరో జంటగా, చివర్లో రీతూ చౌదరి, డిమోన్ పవన్ లు మరో జంటగా శివ మూవీ సాంగ్స్ కి డ్యాన్స్ వేశారు. అనంతరం అమల తో కాసేపు హౌస్ మేట్స్ చిట్ చాట్ చేశారు.
చివర్లో రామ్ గోపాల్ వర్మ రావడం, రాము రాథోడ్ మాట్లాడుతూ ‘సినిమా విడుదల అయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్’ అని రామ్ గోపాల్ వర్మ ని అడగడం, దానికి రామ్ గోపాల్ వర్మ చాలా బాధపడ్డాను, ఎందుకంటే చాలా స్టుపిడ్ ప్రశ్న ఇది అని సమాధానం ఇస్తాడు. ఇక చివర్లో నాగార్జున నిన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే, అక్కడ ఉండగలవా అని అడగ్గా, సంజన లాంటి అందమైన అమ్మాయిలు హౌస్ మొత్తం ఉంటే కచ్చితంగా ఉంటాను అని సమాధానం ఇస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్ తో కాసేపు, ఎమోషన్స్ తో మరికాసేపు ఉండనుంది.
