అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles)..ఈమధ్య కాలం లో దేశం మొత్తం ట్రెండ్ అయిన పేరిది. పికిల్స్ ధరలు ఈ రేంజ్ లో ఉన్నాయేంటి అని ఒక కస్టమర్ అడిగిన దానికి రమ్య సోదరి సుమీ అడ్డమైన బూతులు తిడుతూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం, అది సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. దీంతో ఆమె ఓవర్ నైట్ పాపులారిటీ ని సంపాదించింది. వీళ్ళ గురించి టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో స్పెషల్ స్కిట్స్ చేయడం, సినిమాల్లో ప్రత్యేకమైన ట్రాక్ పెట్టడం వరకు వెళ్ళింది వ్యవహారం. ఆ రేంజ్ పాపులారిటీ వచ్చినప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, ఈమె కచ్చితంగా బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) రియాలిటీ షో కి వెళ్తుంది అని, అందరూ ఊహించినట్టుగానే నిన్న ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. మొదటి రోజు కంటెస్టెంట్స్ తో చాలా చక్కగా మాట్లాడింది కానీ, కొంతమంది కంటెస్టెంట్స్ తో మొదటి రోజే చిన్నపాటి మనస్పర్థలు ఈమెకు ఏర్పడ్డాయి.
కావాలని ఏర్పడాలనే బిగ్ బాస్ టీం ఆమెకు ఒక టాస్క్ ఇచ్చి పంపించాడు. ఆమె చేతిలో 5 పచ్చడ్లు పెట్టి, వాటి పై ఓవర్ యాక్షన్, మ్యానిపులేటర్, ఫేక్, సేఫ్ గేమ్, సెల్ఫిష్ అని రాసి ఉంటుంది. ఇవి హౌస్ లోకి వెళ్లిన తర్వాత వీటి మీద రాసున్నవి ఎవరికీ సూట్ అవుతాయో, వాళ్లకు ఇవ్వమని చెప్తాడు నాగార్జున. అప్పుడు రమ్య మోక్ష(Ramya Moksha) ఓవర్ యాక్షన్ శ్రీజ కి, సేఫ్ గేమ్ భరణి కి, సెల్ఫిష్ డిమోన్ పవన్ కి, ఫేక్ అని దివ్య కి, మ్యానిపులేటర్ అని రాము రాథోడ్ కి ఇస్తుంది. దివ్య, శ్రీజాలతో చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది, మిగిలిన కంటెస్టెంట్స్ అంతగా గొడవ పెట్టుకోలేదు. నేను ఓవర్ యాక్షన్ అయితే నువ్వు కూడా ఓవర్ యాక్షన్, నీకు ఎక్కడ నేను పోటీ వస్తానో అని భయపడి నాకు ఇది ఇచ్చావని అనుకుంటున్నాను అని అంటుంది శ్రీజ.
ఇక దివ్య కి ఫేక్ అని ఇవ్వడానికి కారణం చెప్తూ ‘నేను వైల్డ్ కార్డు గా వచ్చాను..నువ్వు వైల్డ్ కార్డు గా వచ్చావు. హౌస్ లోకి వచ్చిన తర్వాత నువ్వు టాప్ 5 అని కొంతమందికి పెట్టావు, వాళ్ళతోనే ఎక్కువగా ఉంటున్నావు, మిగిలిన వాళ్ళతో సరిగా మాట్లాడట్లేదు. వాళ్ళని టార్గెట్ చేసి గ్రూప్ గేమ్ అంటున్నావ్, కానీ నువ్వే నీకు నచ్చిన వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నావ్. ఆడియన్స్ లో ఉంటూ చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఇది’ అని అంటుంది రమ్య. దానికి దివ్య సమాధానం చెప్తూ ‘టాప్ 5 లో వాళ్ళని పెట్టాను అంటే నాకు వాళ్ళు నచ్చినట్టే కదా, వాళ్ళతోనే కలిసి ప్రయాణం చెయ్యాలని అనుకుంటాను కదా, మిగిలిన వాళ్ళని చివర్లో పెట్టాను అంటే వాళ్ళు నాకు నచ్చనట్టే కదా, ఇందులో ఫేక్ ఎక్కడ ఉంది అని అంటుంది’. అలా వీళ్లిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రమ్య మోక్ష ని చూస్తే చాలా క్లారిటీ తో మాట్లాడే అమ్మాయి లాగా అనిపిస్తుంది. కచ్చితంగా ఈమె తో కంటెస్టెంట్స్ కి కాస్త కష్టమే రాబోయే రోజుల్లో అని అనుకోవచ్చు.