Bigg Boss 9 Telugu : టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే షో ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతొంది. ఇక ఎన్ని షోలు వచ్చిన కూడా బిగ్ బాస్ షో కి ఉన్న గుర్తింపు మరే ప్రోగ్రాం కి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం తోమిదోవ సీజన్ ను సైతం సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది…ఇక ఇలాంటి క్రమంలోనే మధ్యలో కొన్ని ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆశించిన మేరకు ఎంటర్టైన్ చేయలేకపోయాయి. దానివల్ల షో క్రేజ్ రోజు రోజుకి తగ్గుతుందని గ్రహించిన షో యజమాన్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమందిని హౌస్ లోకి తీసుకొచ్చారు… ఇక ఏ కంటెస్టెంట్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దివ్వల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యల విషయంలో మాత్రం చాలా వరకు ప్రతి పేక్షకుడు నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. బిగ్ బాస్ షో మీద గత కొన్ని రోజుల ముందు వరకు గౌరవం ఉండేదని ఇప్పుడు అది తగ్గిపోతుందని మరి కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే మాధురి అనే ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ అనే ఎమ్మెల్సీ క్యాండిడేట్ తో కలిసి ఉంటుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కి ఇంతకుముందే భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినప్పటికి శ్రీనివాస్ తన భార్యకి విడాకులను ఇచ్చేసి మాధురితో కలిసి ఉంటున్నాడు. ఇక ఇదంతా చూసిన నెటిజన్లు మాధురి ని ఉద్దేశించి గతంలో చాలా విమర్శలు చేశారు. శ్రీనివాస్ భార్య సైతం ఈ కథనాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చింది. అయిన శ్రీనివాస్ తన వైఖరిని మార్చుకోలేదు. మాధురి సైతం నేను శ్రీనివాస్ తోనే ఉంటానని లేకపోతే ఈ భూమి మీద ఉండాలేనని తేల్చి చెప్పేసింది…అలాగే చాలా డిబేట్స్ లో పాల్గొని తను చేసిందే కరెక్టే అని వాదించింది. దాని వల్ల గత కొన్ని రోజుల నుంచి ఆమె మీద సోషల్ మీడియాలో గాని, జనాల్లో గాని నెగెటివిటి విపరీతంగా పెరిగిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ – వాణి ల పచ్చటి కాపురంలో నిప్పులు పోసిందంటూ చాలామంది మహిళలు సైతం మాధురి ని తప్పుబట్టారు…
ఇక అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య సైతం నాన్ వెజ్ పికిల్స్ ని తయారు చేస్తూ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ చేసేవారు. ఇలాంటి క్రమంలోనే ఒక వ్యక్తి అలేఖ్య పికిల్స్ రమ్య కి కాల్ చేసి తనకు పికిల్స్ కావాలని అడిగాడు. దాంతో రమ్య ఒకే చెప్పింది.
దాంతో అవతలి వ్యక్తి నాన్ వెజ్ పికిల్స్ మీ దగ్గర చాలా ఎక్కువ రేటు ఉంటుందని చెప్పడంతో రమ్య అతని మీద విరుచుకు పడింది. బూతులు మాట్లాడుతూ ఈ పీకిల్స్ నే కొనివ్వలేని వాడివి రేపు పెళ్లి చేసుకుంటే ఆమెను ఏం పోషిస్తావ్ అంటుకొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు… ఆ తర్వాత ఆమె మీద కూడా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
దెబ్బకి ఆమె అకౌంట్ ని డీయాక్టివేట్ చేసి చాలా రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది…ఇక ఆమెను చూసిన చాలా మంది రమ్య చూడటానికి చాలా అందంగా ఉంది. పద్ధతిగా కనిపిస్తోంది. ఇక ఇలాంటి సమయంలో అలాంటి బూతులు మాట్లాడటం ఏంటి అంటూ ప్రేక్షకులు సైతం రమ్య మీద కోపం గో ఉన్నారు.
మొత్తానికి అయితే మాధురి, రమ్య లను బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డు ద్వారా తీసుకురావడం చాలా నీచమైన ప్రక్రియ అని వాళ్ళిద్దరికి సమాజంలో అసలు ఏ మాత్రం రెస్పెక్ట్ లేదని చెబుతున్నారు. బిగ్ బాస్ షో యాజమాన్య సైతం తమ టిఆర్పి రేటింగ్స్ కోసం ఎవరిని పడితే వారిని హౌస్ లోకి తీసుకువచ్చి ప్రేక్షకుల మీద రుద్దితే వాళ్లు ఆ షో ను తిప్పి కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళను తీసుకొని చాలా వరకు రాంగ్ స్టెప్ వేసిందని చాలా మంది నెటిజన్లు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తుండటం విశేషం…