Pawan Kalyan OG: సరిగ్గా మరో 12 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఓజీ'(They Call Him OG) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ క్వాలిటీ తో ఉన్నాయి. వదిలిన ప్రతీ కంటెంట్ కూడా బాంబు లాగా పేలింది. ఈమధ్య కాలం లో విడుదలైన ఏ సినిమాకు ప్రమోషనల్ కంటెంట్ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. కేవలం టాక్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అది వచ్చిందంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించే భీభత్సం మామూలు రేంజ్ లో ఉండదు.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అది ఏమిటంటే ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారక్టర్ కూడా ఉంటుందట. ఆయన సతీమణి అప్పట్లో జపాన్ లో ఉండేవారట. అలా ఆమెకు ఈ కథకు చిన్న లింక్ ఒకటి ఉందని, అది కచ్చితంగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి. వాస్తవానికి నేతాజీ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట ఓజీ మేకర్స్. కానీ దానిని సప్రైజ్ ఎలిమెంట్ లాగానే ఉంచాలని చివరికి నిర్ణయించారు. మరి ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఒకవేళ ఇది క్లిక్ అయితే సినిమా లెవెల్ ఎవ్వరూ ఊహించని రేంజ్ చేరుతుంది, ఒకవేళ ఇరికించినట్టు ఉంటే మాత్రం సినిమాకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారట మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారట. నిన్ననే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డబ్బింగ్ కూడా పూర్తి చేసాడట. అదే విధంగా ఈ నెల 15 వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాటని విడుదల చేయబోతున్నారట. ఈ పాట సినిమాకు పెద్ద హైలైట్ అంశం గా నిలుస్తుందని అంటున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 20 న వైజాగ్ లో భారీ లెవెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారట. ఈ ఈవెంట్ తర్వాత పలు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మేనియా ఎలా ఉండబోతుంది అనేది.