Bigg Boss 9 Telugu Ramu Rathod: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో కేవలం ఒకే ఒక్క సంఘటన చాలు, ఒక మనిషి రియల్ క్యారక్టర్ ని బయట పెట్టడానికి. అప్పటి వరకు జనాల్లో ఆ మనిషి మంచి పాజిటివ్ అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క సంఘటన ఆ మనిషి పై పూర్తిగా నెగిటివ్ ఫీలింగ్స్ ని రప్పిస్తుంది. ఇప్పుడు రాము రాథోడ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. మొదటి నుండి రాము రాథోడ్ ని తనూజ, భరణి వంటి వారు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. రాము కూడా వాళ్ళను అక్కా, అన్నా అంటూ ప్రేమగా పిలుస్తూ వెనకాలే తిరిగేవాడు. కానీ కీలకమైన సమయం లో తాను అక్కగా భావించిన తనూజ కూడా స్టాండ్ తీసుకోవడం లో విఫలం అయ్యాడు. గోడ మీద పిల్లి లాగా రాము వ్యవహరించడం జనాలకు అసలు నచ్చలేదు. అసలు ఏమి జరిగిందో చూద్దాం.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
ఈ టాస్కు ని టెనెంట్స్ లో ఉన్న ఒకరికి శాశ్వతంగా ఓనర్ అయ్యేందుకు నిర్వహించాడు బిగ్ బాస్. అప్పటికే ఓనర్స్ గా ఉన్నవారు వస్తువులను విసురుతూ ఉంటారు, టెనెంట్స్ వాటిని కొన్ని బ్లాక్స్ మీద నిలబడి పట్టుకోవాలి. అనంతరం తమకు ఇవ్వబడిన బాస్కెట్స్ లో వేసుకొని వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఈ టాస్క్ లో రీతూ చౌదరి ఎలా అయినా ఓనర్ అవ్వాలనే తపనతో రాము ని పావుగా వాడుకుంది. రాము ని పక్కకి తీసుకెళ్లి నువ్వు నేను మాత్రమే ఈ గేమ్ లో మిగలాలి అంటుంది. అందుకు రాము ఒప్పుకుంటాడు. కానీ తీరా గేమ్ సమయానికి ఆమె రాము బాస్కెట్ మొత్తం ఖాళీ చేసింది. ఇదేంటి ఇంత పెద్ద వెన్నుపోటు పొడిచింది అని రాము షాక్ కి గురై అసలు ఏమి ఆడకుండా అలా ఉండిపోతాడు. అంతకు ముందు ఆమె తనూజ ని గేమ్ నుండి తప్పిద్దాం పదా అని రాము తో సైగలు చేస్తుంది.
దీనిని తనూజ గమనించింది. ఒక సందర్భం లో రీతూ చౌదరి ఇమ్మానుయేల్ ని గ్రూప్ గా ఆడుతున్నారు అనే ప్రస్తావన తీసుకొని రాగా, తనూజ మధ్యలో కలగచేసుకొని నీకు మాత్రం గ్రూప్స్ లేవా?, ఇందాక నువ్వు రాము తో తనూజ ని అవుట్ చేద్దాం పద అని అనలేదా అంటుంది. నేను అలా అనలేదు, దమ్ముంటే నిరూపించి చూపించు అని రీతూ అంటుంది. అప్పుడు తనూజ రాము ని అడగ్గా , అతను తనూజ పక్కన స్టాండ్ తీసుకోకుండా రీతూ కి సపోర్ట్ గా నిలుస్తాడు. దీనికి తనూజ బాగా హర్ట్ అవుతుంది. ఎట్టకేలకు టెనెంట్స్ ఏకాభిప్రాయం తో రాము ని ఓనర్ ని చేస్తారు. ఓనర్ అయ్యాక తనూజ వద్దకు రాము రాగా, ఇంకోసారి నన్ను అక్కా అని పిలవకు, అక్కా అక్కా అంటూ తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచావు అని చెప్పుకొని తనూజ చాలా బాధ పడుతుంది. ఇది రాము తెలిసి చేసాడో, తెలియక చేసాడో, కన్ఫ్యూజన్ కి గురి అయ్యాడో, కారణం ఏదైనా కానీ, ఈ ఎపిసోడ్ ఆయనకు బాగా నెగిటివ్ అయ్యింది అనేది మాత్రం వాస్తవమైన విషయం.