Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లోనే కాదు, తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ ఎవరైనా ఉన్నారా అంటే భవిష్యత్తులో అందరూ ఇమ్మానుయేల్ పేరు చెప్తారేమో. ఆ రేంజ్ లో ఆయన ఆట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుంది. మొదటి రోజు హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండే అందరితో ఎంతో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు ఇమ్మానుయేల్. ఎనెర్టైన్మెంట్ ఇవ్వాల్సిన టైం లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, గొడవ పడాల్సిన టైం లో గొడవపడుతున్నాడు, తన అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా తెగిస్తున్నాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు,అన్ని రాకాల ఎమోషన్స్ ఆయనలో ఉన్నాయి. అవన్నీ ఈ రెండు వారాల్లోనే బయటకు చూపించాడు. ఒక్కసారి కూడా ఇమ్మానుయేల్ డ్రామా ఆడుతున్నట్టుగా అనిపించలేదు. అంతే కాదు ఇమ్మానుయేల్ ఈ రెండు వారాల్లో గొప్ప మాస్టర్ మైండ్ అని కూడా నిరూపించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తోపు కంటెస్టెంట్ అని చెప్పొచ్చు.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
ఇప్పటి వరకు ఆయన ఆడిన ప్రతీ ఆట తన కోసం ఆడలేదు. కేవలం తనతో పాటు ఉన్న టెనెంట్స్ కోసమే ఆడాడు. కెప్టెన్ కూడా తన కోసం అవ్వాలని అనుకోలేదు, తానూ కెప్టెన్ అయితే తనతో ఉన్న తోటి టెనెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు. ఇలా ప్రతీ దాంట్లోనే తన అనే స్వార్దాన్ని పక్కన పెట్టి, తనకోసం ఉన్న కంటెస్టెంట్స్ కోసం ఆడాడు. ఉదాహరణకు నిన్న మెయిన్ బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత ఓనర్ అయ్యేందుకు ఇమ్మానుయేల్ కి ఒక అవకాశం వచ్చింది. ఆయన తల్చుకుంటే కచ్చితంగా ఓనర్ అయ్యేవాడు. ఓనర్ అయితే హౌస్ లోపలకు వెళ్లి భోగభాగ్యాలు అనుభవించే ఛాయస్ అతనికి ఉంది. కానీ తానూ హౌస్ లోకి వెళ్తే మొదటి రోజు నుండి తనతో కలిసున్న టెనెంట్స్ బాగా వీక్ అయిపోతారు అనే ఉద్దేశ్యం తోనే ఆయన గేమ్స్ ఆడాడు.
కానీ అలా ఆడిన ప్రతీసారీ ఓడిపోయాడు ఇమ్మానుయేల్. ముఖ్యంగా రీతూ చౌదరి ని తన బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాడు. కానీ ఆమెకు ఓనర్స్ గ్యాంగ్ లో డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ లపైనే కన్ను. ఎంతసేపు హౌస్ లోపలకు వెళ్ళాలి, ఇష్టమైన ఫుడ్ తినాలి, అందుకే డిమోన్ పవన్ తో బలవంతపు లవ్ ట్రాక్ నడుపుతుంది. ఇలా తన స్వార్థం కోసం భరణి, ఇమ్మానుయేల్ లో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా, కావాలని ఆమె డిమోన్ పవన్ ని గెలిపించడం కోసం అతనికి అనుకూలంగా రూల్స్ ని పెట్టి, చివరికి అతన్నే కెప్టెన్ ని చేసింది. దీనికి పాపం ఇమ్మానుయేల్ చాలా బాధపడుతాడు. రీతూ చౌదరి ని నేను నా స్నేహితురాలు అనుకున్నాను, కానీ ఆమె ఎంతసేపు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు నా కోసం ఆడుకోలేదు, మన కోసమే ఆడాను, కానీ ప్రతీ సారీ నాకు అన్యాయమే జరుగుతుంది అం