Bigg Boss 9 Telugu Pawan Kalyan: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ పడాల(Pawan Kalyan). ఆర్మీ నుండి నేరుగా ‘అగ్నిపరీక్ష’ షోలో ఒక సాధారణ సామాన్యుడిగా పాల్గొన్న ఈయన, అద్భుతంగా టాస్కులు ఆడుతూ అశేష ప్రేక్షాభిమానం ని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఆయన ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే అడుగుపెట్టాడు. ఈయన పై అంచనాలు భారీగానే ఉండేవి. కానీ మొదటి మూడు వారాలు ఇతను అసలు కెమెరాలకు కనిపించకపోవడం, ఎంతసేపు అమ్మాయిల చుట్టూ తిరగడం, వాళ్ళు ఏడిస్తే ఓదార్చడం, ఇలాంటివి చూసి ఆడియన్స్ కి చిరాకు కలిగింది. మనం ఇతని మీద ఈ రేంజ్ అంచనాలు పెట్టుకొని లోపలకు పంపిస్తే, ఇతనేంటి ఇంత దారుణంగా ఆడుతున్నాడు అని ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళే చిరాకు పడ్డారు. ఫలితంగా మూడవ వారం లో ప్రియా తో పాటు డేంజర్ జోన్ లోకి వచ్చాడు.
అతి తక్కువ మార్జిన్ తో సేవ్ అయ్యాడు, ప్రియా ఎలిమినేట్ అయ్యింది. ఆట మార్చుకోకపోతే ఈసారి నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అంతా అనుకున్నారు. నాగార్జున నుండి కూడా స్పష్టమైన సమాచారం రావడంతో తన ఆట తీరు మొత్తాన్ని మార్చేశాడు పవన్ కళ్యాణ్. గత వారం ఆయన ఇమ్మానుయేల్ తో కలిసి ఏ రేంజ్ లో ఆడాడో మనమంతా చూసాము. పడిన కష్టానికి ఫలితంగా లేకుండా పోయిందని అంతా అనుకున్నారు కానీ, ఆడియన్స్ దృష్టిలో మాత్రం జీరో నుండి హీరో అయ్యాడు. మళ్లీ ఆయన ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఎలాంటిది?, అతను ఎలా ఉండేవాడు, చిన్నతనం నుండి ఎలా పెరిగాడు వంటివి ఆయన సోదరుడు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘చిన్నతనం నుండి పవన్ కళ్యాణ్ కి అవతల వ్యక్తి బాధపడుతుంటే తీసుకునే వాడు కాదు. వాళ్ళని ఓదార్చి, సంతోషపరిచేంత వరకు అతని మనసు శాంతించేది కాదు. దీనిని సోషల్ మీడియా లో ట్రోల్ చేయడం బాధాకరం. మా వాడు ఏ అమ్మాయి వెనుక తిరగలేదు. అందరూ మా కళ్యాణ్ రీతూ చౌదరి చుట్టూ తిరుగుతున్నాడని సోషల్ మీడియా లో రుద్దేశారు. కానీ ఆ అమ్మాయి మా వాడి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి కారణంగా మా వాడి గేమ్ చాలా దెబ్బ తిన్నది. కళ్యాణ్ చాలా ఎమోషనల్ వ్యక్తి. ప్రతీ చిన్న విషయాన్నీ తన మనసుకు తీసుకొని బాధపడతాడు. మళ్లీ తానే కూల్ అయ్యి అందరితో మామూలుగా ఉంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
