Bigg Boss 9 Telugu Pawan Kalyan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా సామాన్యులకు ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిపరీక్ష షో ద్వారా మంచి క్రేజ్ ని, పాపులారిటీ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణే. ఈ షోలో ఆయన ప్రతీ టాస్కు ని అద్భుతంగా ఆడుతూ అటు జ్యూరీ ని మాత్రమే కాకుండా, ఆడియన్స్ మనసులను కూడా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఈయనే. అయితే గత వారం వరకు పవన్ కళ్యాణ్ తన మార్కు ఆట ని చూపించలేకపోయాడు. అయ్యో ఇంత అద్భుతంగా ఆడే కంటెస్టెంట్, హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇలా అయిపోయాడేంటి?, ఎంతసేపు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటాడే తప్ప, ఇతని నుండి అసలు కంటెంట్ రావడం లేదని ‘అగ్నిపరీక్ష’ షోలో ఇతనికి ఓట్లు వేసిన ఆడియన్స్ బాధపడుతూ ఉండేవారు.
గత వారం ఈయన ప్రియతో పాటు డేంజర్ జోన్ లోకి వచ్చేసాడు. టాప్ 5 వరకు ఉంటాడు, కచ్చితంగా టైటిల్ గెలుస్తాడు అని అనుకున్న కంటెస్టెంట్ ఇలా అవుతాడని అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకున్నారు. తన ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, వీకెండ్ ఎపిసోడ్స్ తర్వాత తనని తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మానుయేల్ తో కలిసి విశ్వరూపం చూపించేసాడు. ఇంత సత్తా పెట్టుకొని ఇన్ని రోజులు ఇంత సైలెంట్ గా ఉన్నాడా అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆర్మీ లో మంచిగా ట్రైనింగ్ తీసుకున్న వాడు కాబట్టి, తనకు పోటీగా ఎంత మంది ఎదురొచ్చిన అవతలకు విసిరేసి, అద్భుతంగా గేమ్ ని ఆడాడు.
అంతే కాకుండా ఈ వారం ఆయన అమ్మాయిలతో తిరగడం కూడా చాలా వరకు తగ్గించేసాడు. నిన్నటి ఎపిసోడ్ లో అప్పుడప్పుడు తనూజ తో పులిహోర కలుపుతున్నాడు కానీ, గతంతో పోలిస్తే కాస్త డోస్ తగ్గించాడు. కేవలం గేమ్ పైన మాత్రమే తన ఫోకస్ ని పెట్టాడు. కళ్యాణ్ నుండి ఆడియన్స్ కోరుకున్నది ఇదే. గత వారం డేంజర్ జోన్ లోకి వచ్చిన కళ్యాణ్ ని, అదే ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో పోల్స్ లో టాప్ 3 లో కూర్చోబెట్టారు. ఇదే తరహా లో తన ఆటని ఆడుతూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఆయన టైటిల్ రేస్ లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అంత దూరం వస్తాడో లేదో చూడాలి.