Bigg Boss 9 Telugu : ఈ సీజన్ ( Bigg Boss 9 Telugu) లో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించిన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే, అది భరణి ఎలిమినేషన్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనుకున్న తోపు కంటెస్టెంట్, ఇలా ఆరు వారాల్లోనే బయటకు వచేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆయన ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం, అత్యధిక బంధాలను భుజాన వేసుకోవడం వల్లే. మొదటి మూడు వారాలు ఆయనకు తనూజ తో మంచి రిలేషన్ ఉన్నప్పటికీ తన గేమ్ పై ఎక్కడా ఎఫెక్ట్ పడలేదు.కానీ ఎప్పుడైతే దివ్య వచ్చిందో, అప్పటి నుండి భరణి గేమ్ పూర్తిగా గాడి తప్పింది అనేది వాస్తవం. నెటిజెన్స్ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. హౌస్ మేట్స్ ఫీలింగ్ కూడా అదే. తనూజ కి భరణి అంటే అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ, అందరూ ఆయనతో ఉన్న బాండింగ్ ని ఎగతాళి చేయడం, ఆమె కారణంగా ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనడం తో కావాలని దూరంగా ఉంటూ వచ్చింది.
ఈ విషయాన్నీ నిన్న ఆమె సుమన్ తో చెప్పడం మనమంతా చూసాము. కానీ నేడు నామినేషన్స్ లో తనూజ ని, దివ్య ని ఈ పాయింట్ మీదనే టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఇందులో దివ్య సాయి ని నామినేట్ చేస్తుంది. వీళ్లిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మధ్యలో కోపం తెచ్చుకున్న సాయి ‘నీ వల్ల టాప్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ పాతాళం లోకి పడిపోయి బయటకు వెళ్ళిపోయాడు’ అని అంటాడు. దానికి దివ్య సమాధానం చెప్తూ ‘నా వల్ల ఆయనేమి బయటకు వెళ్లిపోలేదు’ అని అంటుంది. ఇక ఆ తర్వాత తనూజ ని రమ్య నామినేట్ చేస్తుంది. ఈమె మాట్లాడిన మాటలు చూస్తే ఎవరికైనా కోపం రావాల్సిందే.
తనూజ ని నామినేట్ చేస్తూ ‘నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుండి బయటకురా, నువ్వొక డ్రామా క్వీన్ వి, నువ్వు పూర్తిగా ఫేక్’ అని అంటుంది. దానికి తనూజ సమాధానం చెప్తూ ‘నన్ను నువ్వు డ్రామా క్వీన్ అనుకుంటావా?, సీరియల్ యాక్టర్ అనుకుంటావా అనేది పూర్తిగా నీ ఇష్టం. ఇది నా గేమ్. నన్ను కార్నర్ చేయడానికి నువ్వెవరు. ముందు నువ్వు వయస్సుకి తగ్గట్టు ప్రవర్తించు’ అని అంటుంది. అప్పుడు రమ్య ‘నీకు వయస్సు పెరిగింది కానీ, బుర్ర పెరగలేదు’ అని అంటుంది, దానికి తనూజ కౌంటర్ ఇస్తూ ‘మాటల జాగ్రత్త గా రానివ్వు’ అని వార్నింగ్ ఇస్తుంది. చివర్లో రమ్య ‘టాప్ కంటెస్టెంట్స్ ని బయటకు పంపేయడానికి వచ్చిన దేవతవి’ అని అంటుంది. అప్పుడు తనూజ ‘థాంక్యూ..నేను దేవతనే..వచ్చి దర్శనం చేసుకో..వెళ్ళవమ్మా’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఈ ప్రోమో ని చూస్తుంటే ఈరోజు నామినేషన్స్ చాలా గట్టిగానే ఉండేలాగా అనిపిస్తుంది, హౌస్ మేట్స్ అందరూ వీళ్ళిద్దరినీ టార్గెట్ చేసినట్టుగా కూడా అనిపిస్తోంది.
