Bigg Boss 9 Telugu : నిన్న మొన్నటి వరకు ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) టైటిల్ రేస్ లో ఇమ్మానుయేల్ కూడా ఉండేవాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ ఆయన గ్రాఫ్ ని పాతాళంలోకి పడిపోయేలా చేసింది. ప్రతీ వారం ఓట్లు వేసే అభిమానులే ఇమ్మానుయేల్ చేసిన ఆ పనికి చివాట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. భరణి కారణంగా వచ్చిన పవర్ అస్త్ర ని ,భరణి ని సేవ్ చేయడానికి ఉపయోగించనందుకు ఇమ్మానుయేల్ ని తిట్టిపోస్తున్నారు నెటిజెన్స్. ఆ ప్రభావం సోషల్ మీడియా పోల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండు రోజుల ముందు వరకు కూడా తనూజ కి 55 శాతం ఓటింగ్ ఉంటే, ఇమ్మానుయేల్ కి కనీసం 30 శాతం ఓటింగ్ అయినా ఉండేది. కానీ ఇప్పుడు అది 11 శాతానికి పడిపోయింది. అయితే ఎమోషనల్ గా చూస్తే ఇమ్మానుయేల్ చేసింది వెన్నుపోటు అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఒక గేమర్ గా అలోచించి చూస్తే, ఇమ్మానుయేల్ చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ అని అనిపిస్తుంది. బిగ్ బాస్ షో కి వచ్చింది టైటిల్ గెలుచుకోవడానికి, బంధాలు పెంచుకోవడానికి కాదు. ఇమ్మానుయేల్ కి మొదటి నుండి టాస్కుల్లో పోటీ ఇస్తూ వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది భరణినే. హౌస్ లో ఆయన ఎవరినైనా ఓడించగలడేమో కానీ, భరణి తో గేమ్ పడినప్పుడు ఇమ్మానుయేల్ ఓడించలేకపోయాడు. ఎన్నో సందర్భాలను గతంలో మనం చూసాము. అలాంటప్పుడు తనకు టైటిల్ గెలవడానికి, ప్రత్యర్థి ఎలిమినేషన్ తన చేతుల్లో ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయడానికే చూస్తారు కదా?, గేమర్ గా ఇమ్మానుయేల్ అదే చేసాడు. పైగా గత రెండు వారాలుగా భరణి తో ఇమ్మానుయేల్ కి కనెక్షన్ తగ్గిపోతూ వచ్చింది. ఎప్పుడైతే భరణి కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మానుయేల్ కి సపోర్ట్ చేయలేదో, అప్పటి నుండి ఇమ్మానుయేల్ కి భరణి పై కోపం మొదలైంది.
సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ, మీ అమ్మ సంజన ప్రభావం నీ మీద ఉంది, నువ్వు కెప్టెన్ అయితే ఆమెకు అనుకూలంగా వ్యవహరిస్తావు అని భరణి అనడంతో ఇమ్మానుయేల్ బాగా హర్ట్ అయ్యాడు. అంతే కాకుండా రీసెంట్ గా నాకు తనూజ మరియు దివ్య తో ఉన్న బాండింగ్ మీద జోకులు వేయొద్దు అని భరణి ఇమ్మానుయేల్ కి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా ఇమ్మానుయేల్ కి నచ్చలేదు. ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని భరణి కి కాకుండా రాము కి ఇమ్మానుయేల్ పవర్ అస్త్ర ని ఉపయోగించి ఉండొచ్చు. ఇప్పుడు భరణి ఎలిమినేట్ అవ్వడం తో తనూజ మరియు దివ్య బంధ విముక్తులు అయ్యారు. ఇక నుండి వాళ్ళు గేమ్స్ ఎలా ఆడుతారో చూడాలి. ఇద్దరికీ టైటిల్ కొట్టేంత సత్తా ఉంది. రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో, ఎన్ని ట్విస్టులు రాబోతున్నాయో చూద్దాం.