Bigg Boss 9 Telugu Mask Man: ప్రతీ మనిషికి ఈగో ఉంటుంది, కానీ అది కేవలం కొంతమేరకు పరిమితం. కానీ అసలు పరిమితి లేని ఈగో ఉంటే, ఆ మనిషిని మూర్ఖుడు అంటారు. ఈ సీజన్ లో బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ హరీష్ ఆ కోవకు చెందిన వాడే. ఈ ప్రపంచం మొత్తం నువ్వు తప్పు చేసావు రా బాబు అని చెప్పినా, లేదు నేను చేసింది కరెక్ట్ అని సమర్దిమ్చుకునే మూర్ఖుడు ఇతను. నోటికొచ్చినట్టు ఎదుటి వ్యక్తి పై నోరు పారేసుకోవడం, ఆయన అన్న మాటలనే చూపించి నువ్వు తప్పు చేసావు కరెక్ట్ చేసుకో అంటే మాట వినకుండా మూర్ఖంగా కూర్చోవడం, అన్నం నీళ్లు తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడం వంటివి చూస్తే అసలు ఇతను ఏమి మనిషి రా బాబు అని అనిపించక తప్పదు. ఈరోజు ఇతను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మీద మాత్రమే కాదు, ఏకంగా బిగ్ బాస్ మీదనే నోరు పారేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ ని నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్తుంది. ఆరోజు మీరు మాట్లాడింది తప్పు అని నాకే కాదు, హౌస్ లో అందరికీ అనిపించింది, అది తప్పు కాదు అని నిరూపించుకునే ప్రయత్నం మీరు చెయ్యాల్సింది కానీ, మీరు అన్నం నీళ్లు తీసుకోకుండా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు అని అంటుంది. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ రెచ్చిపోతాడు, వీళ్లిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు శ్రీజా అంత బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవాలని అనుకుంటే వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు హరీష్ వెళ్ళిపోతా, దమ్ముంటే బిగ్ బాస్ ని గేట్లు తీసి పంపమని అని అంటాడు ముందు రోజు ఇతను రెండు రోజుల నుండి అన్నం, నీళ్లు ఏమి తీసుకోవడం లేదని, శ్రీజ అతనికి అన్నం కలుపుకొని వెళ్లి తినిపించే ప్రయత్నం చేస్తుంది.
దానికి మాస్క్ మ్యాన్ హరీష్ ‘అవసరమే లేదు..నేను అన్నం నీళ్లు తాగేది బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాతే. మీలాంటి మనుషులు ఉన్న చోట నేను ఏది ముట్టుకోను’ అని అంటాడు. ఈ పాయింట్ ని కూడా తీసుకొస్తుంది శ్రీజ. ఆమె చెప్పిన పాయింట్స్ బాగానే ఉన్నాయి కానీ, ఆమె మాట్లాడే మాటలు కూడా అవతల వ్యక్తిని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి అనుకోండి అది వేరే విషయం. కానీ మాస్క్ మ్యాన్ హరీష్ ఆడవాళ్ళతో దమ్ముంటే రండి అని మాట్లాడడం, ఆ తర్వాత ఆయన ఏకంగా బిగ్ బాస్ మీదనే నోరు పారేసుకోవడాన్ని ఈ వీకెండ్ కచ్చితంగా నాగార్జున నిలదీస్తాడనే అనిపిస్తుంది. ఒకవేళ నిలదీయకపోతే జనాలు నాగార్జున ని, బిగ్ బాస్ షో ని తప్పుబట్టే ప్రమాదం ఉంటుంది. ఏమి జరుగుతుందో చూడాలి మరి.