Bigg Boss 9 Telugu Manish: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అగ్నిపరీక్ష షో ద్వారా హౌస్ లోపలకు అడుగుపెట్టిన సామాన్యులు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మన అందరికీ తెలిసిందే. అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు రా వీళ్ళని, సామాన్యులు చాలా మంచిగా ఉంటారు, పాపం సినీ సెలబ్రిటీలను ఎలా తట్టుకుంటారో ఏంటో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే సామాన్యులను తట్టుకోవడం సెలబ్రిటీలకు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాగా మారింది. ఒక టీం గా లోపలకు వచ్చిన వాళ్ళ మధ్యలోనే సరైన యూనిటీ లేదు. ఫలితంగా ప్రతీ రోజు గొడవలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రియా, శ్రీజా నోర్లకు మనీష్, డిమోన్ పవన్ లాంటోళ్ళు భరించలేకపోతున్నారు. రీసెంట్ గానే డిమోన్ పవన్ ఎలా వెక్కిళ్లు పెట్టి ఏడ్చాడో మనమంతా చూసాము. ఇప్పుడు మర్యాద మనీష్ వంతు వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న కెప్టెన్ సంజన ఇంట్లో దొంగలు ఎక్కువ అయిపోయారు, దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి,ఇక మీదట అలా జరగడానికి వీలు లేదు, అందుకోసం నేను ఒక మానిటర్ రోల్ ని క్రియేట్ చెయ్యాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది సంజన. దీనికి మనీష్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తనకు ఎలాంటి రోల్ లేదు కాబట్టి, ఆ రోల్ నేనే చేస్తాను అని చెప్పుకొస్తాడు. కానీ శ్రీజ అందుకు ఒప్పుకోదు. ఇప్పటికే కుకింగ్ మానిటర్ ప్రియా ఉంది. ఆమెనే దొంగతనాలు జరగకుండా చూసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా మరో మానిటర్ ని పెట్టుకుంటే ఆమెని అవమానించినట్టే కదా అని అంటుంది శ్రీజ. దీనికి మనీష్ ఏకీభవించడు, ఇద్దరి మధ్య వాదనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు శ్రీజా ‘నీకు ఎలాంటి జాబ్ లేదని, అవతల వ్యక్తి జాబ్ ని లాగుకోవాలని చూస్తున్నావ్’ అని అంటుంది. నీకు అరవడం ఒక్కటే జాబ్ అని మనీష్ అందుకు కౌంటర్ వేస్తాడు.
అప్పుడు శ్రీజ ‘పాయింట్ లేకుండా నిన్ను పాయింట్ అవుట్ చేస్తున్నాం అని మూలన కూర్చొని ఏడుస్తుంటావ్, అదే కదా నువ్వు చేసేది’ ఆంటీలు చెప్పుకొచ్చింది. దీనికి మనీష్ బాగా హర్ట్ అయిపోతాడు. ఒక పక్కన ముభావంగా కూర్చొని ఉండగా, ఇమ్మానుయేల్ అక్కడికి వస్తాడు. శ్రీజ అన్న మాటలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ‘నేను ఇలాంటి ఇడియట్స్ మధ్యలో ఉండాలని అనుకోవడం లేదు అన్నా..మీ టెనెంట్స్ బెడ్ రూమ్ లో ఒక్క బెడ్ ఖాళీ అయితే చెప్పండి, అక్కడికి వచ్చి ఉంటాను’ అంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అంతే కాదు ఆయన ఫ్లో లో ‘వరస్ట్ కామనెర్స్’ అని కూడా ఉంటాడు. తాను కూడా ఆ క్యాటగిరీ నుండి వచ్చిన వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోయాడు. దీనిపై ఈ వీకెండ్ లో గట్టి చర్చ నే జరిగేలా ఉంది, చూడాలి మరి.