Bigg Boss 9 Telugu: ఒకే ఒక్క గుడ్డు దొంగతనం చేసింది అనే పాపానికి సంజన ని ఓనర్స్ గా పిలవబడే ప్రియా,శ్రీజ వంటి వారు కాల్చుకొని తింటున్నారు. నాగార్జున చెప్పినా, బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) చెప్పినా, వీళ్లిద్దరు కెప్టెన్ చెప్పే మాటలను అసలు వినట్లేదు, పట్టించుకోవడం లేదు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తున్నారు. తనూజ వంట చేయలేకపోతోంది, ఆమె స్థానం లోకి కొత్త కుక్ ని తీసుకోవాలని అనుకుంటున్నాను, ఇప్పటికే సామాన్యులకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి, ఓనర్స్ నుండి ఒకరిని తీసుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. దానికి శ్రీజా మాట్లాడుతూ ‘నాగార్జున గారు స్వయంగా చెప్పారు, ఓనర్స్ కి ఎలాంటి పనులు ఇవ్వకూడదు అని’ అని అంటుంది. అప్పుడు సుమన్ శెట్టి మాట్లాడుతూ ‘నేను చేసే ఇంటి క్లీనింగ్ టాస్క్ ని వేరే వాళ్లకు అప్పగించండి, అసిస్టెంట్ కుక్ గా నేను చేయడానికి రెడీ’ అని అంటాడు.
అప్పుడు సంజన వెంటనే అతనికి కుక్ బ్యాడ్జ్ తగిలించేస్తుంది. ఇక మెయిన్ కుక్ గా ఎవరు ఉండబోతున్నారు అనేది ఈరోజు చూడాలి. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో ఇక మీదట దొంగానాలు జరగకుండా ఉండడం కోసం కెప్టెన్ సంజన ఒక మానిటర్ ని పెట్టాలని అనుకుంటుంది. అందుకు ప్రియా, శ్రీజ ఒప్పుకోరు. కుకింగ్ మానిటర్స్ నే అన్ని పనులు చూసుకుంటున్నారు, కొత్తగా ఇంకొకరు ఎందుకు అని వాళ్ళు వాదిస్తున్నారు. వాస్తవానికి కెప్టెన్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్, కానీ వీళ్లిద్దరు కెప్టెన్ తీసుకునే ప్రతీ నిర్ణయానికి అడ్డు చెప్తూనే ఉన్నారు. అప్పటికీ డిమోన్ పవన్ కూడా అంటాడు. ఈ హౌస్ కి బిగ్ బాస్ తర్వాత కెప్టెన్ నే అన్నిటికి పెద్ద. కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కచ్చితంగా కట్టుబడాల్సిందే అని అంటాడు వాళ్ళతో. అయినప్పటికీ కూడా మాట వినరు వీళ్లిద్దరు. సంజన ఒకానొక సమయం లో ప్రియా పెట్టే టార్చర్ కి చాలా కోపం తెచ్చుకుంటుంది.
ఆ కోపం లో పెద్ద క్లాస్ పీకుతుంది. ఆమె మాట్లాడేవి సరైన పాయింట్స్ కాబట్టి ప్రియా కూడా ఎలాంటి కౌంటర్ ఇవ్వలేక సైలెంట్ గా అలా చూస్తూ ఉండిపోతుంది. వీళ్లకు దొంగతనం చేయకుండా కాపాడుకునే మానిటర్ ని నియమించడం ఎంత ముఖ్యమో అర్థం అయ్యేలా చేసేందుకు సంజన ఆరెంజ్ లను దాచి పెట్టేస్తుంది. దీనిని గుర్తించిన ప్రియా ఆరంజ్ లను ఎవరో దొంగలించారు. ఇది చూస్తుంటే సంజన గారే వీటిని దయచేసి, మానిటర్ ఎంత ముఖ్యమో మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంది సంజన. సంజన అప్పుడు ఇంట్లో జరిగే ప్రతీ దొంగతనానికి నన్ను చొర్నెర్ చేయడం అలవాటు అయిపోయింది, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అంటుంది. ఇలా సంజన మాట వినకపోయేసరికి ఆమె హద్దులను దాటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.