Bigg Boss 9 Telugu Emmanuel: నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మనీష్ విషయం లో ఒక్కటే అనిపించింది. ఇతను బిగ్ బాస్ షో కి అర్హుడు కాదు, శ్రీముఖి మరియు అభిజీత్ సెలక్షన్ చాలా తప్పు అయ్యింది, ఇతనికి బదులుగా నాగ ప్రశాంత్ లేదా షాకీబ్ కి పంపి ఉండుంటే బాగుండేది అని. అక్కడ అంత మంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఎన్నో విజయాలు చూశారు, జీవితం లో ఎంతో మంది గొప్పళ్లతో ప్రయాణం చేశారు. అలాంటి సెలబ్రిటీస్ కూడా చూపించని యాటిట్యూడ్, బిల్డప్ ఇతను చూపిస్తున్నాడు. తన తోటి ఓనర్స్ తో కూడా సరిగా నడుచుకోవడం లేదు. ఎప్పుడూ గొడవలే, నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఇతన్ని సంచాలక్ గా పెడుతాడు బిగ్ బాస్. ఆ టాస్క్ చూసిన తర్వాత ఇమ్మానుయేల్ మీద పగతోనే కావాలని తప్పుడు నిర్యాణం ఇచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత అతని ప్రవర్తన కూడా చాలా బలుపు తో నిండిపోయింది.
Also Read: ‘మిరాయి’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా?
పూర్తి వివరాల్లోకి వెళ్తే కెప్టెన్సీ టాస్క్ కంటెండర్లుగా సంజన, ఇమ్మానుయేల్, డిమోన్ పవన్, మాస్క్ మ్యాన్ హరీష్ మరియు శ్రేష్టి వర్మ నిలుస్తారు. కానీ వీళ్ళు నేరుగా టాస్కులు ఆడరు, వీళ్ళ తరుపున వేరే వాళ్ళు ఆడుతారు. ఇమ్మానుయేల్ తరుపున భరణి, సంజన తరుపున దమ్ము శ్రీజ, డిమోన్ పవన్ కోసం ప్రియా, హరీష్ కోసం పవన్ కళ్యాణ్ మరియు శ్రేష్టి వర్మ కోసం మహేష్ రాథోడ్ ఆడుతారు. టాస్క్ ఏమిటంటే ఒక గోడ మీద ఉన్నటువంటి ఇనప రాడ్స్ పై నిల్చుకోవాలి. ఎవరైతే చివరి వరకు నిల్చొని ఉంటారో వాళ్ళే విన్నర్. పక్కన రెడ్ సిగ్నల్స్ మరియు గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి. రెడ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్స్ వచ్చినప్పుడు గోడ వద్దకు వెళ్లి ఇనప రాడ్స్ ని తీసివేయాలి. మొదటి ఇద్దరు రెడ్ సిగ్నల్ వచ్చిన చూసుకోకుండా వెళ్లి ఇనప రాడ్స్ ని తీస్తారు.
వాళ్ళు అలా తీసినప్పుడు మనీష్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఇమ్మానుయేల్ కూడా అదే చేస్తాడో, అప్పుడు మాత్రం ఆయన్ని, భరణి ని టాస్కు నుండి తొలగించేస్తాడు. ఇది చూసే ఆడియన్స్ కి చాలా అంటే చాలా అన్యాయం గా అనిపించింది. ఉండొచ్చు కానీ మరీ ఇంత బలుపా అని ప్రతీ ఒక్కరు మనీష్ పై మండిపడుతున్నారు. వీకెండ్ లో నాగార్జున నుండి ఇతనికి వైట్ వాష్ తప్పేలా లేదు. ఇతనికి మొదటి నుండి ఇమ్మానుయేల్, భరణి అంటే పడదు. పైగా భరణి ఈ టాస్కు కి ముందు మనీష్ సగం తిని డస్ట్ బిన్ లో పారేసిన రోటి గురించి ప్రశ్నించడం తో ఆయన అహం ఇంకా దెబ్బ తినింది. అప్పటి నుండి మనసులో పగ పెంచేసుకున్నాడు. ఇదే ప్రవర్తన తో బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమని గతం లో ఎన్నో ఉదాహరణలు వచ్చాయి. వచ్చే వారం ఈయన నామినేషన్స్ లోకి వస్తే హౌస్ నుండి తరిమేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు.