HomeతెలంగాణKCR: అవినీతి చేసినా వదిలేయాలా? కేసీఆర్‌కు ఎందుకీ మినహాయింపు!

KCR: అవినీతి చేసినా వదిలేయాలా? కేసీఆర్‌కు ఎందుకీ మినహాయింపు!

KCR: తెలంగాణ రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఎప్పటికీ తలెత్తుతుంటాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ అధికార కాలంలో జరిగిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ చర్చనీయాంశాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(కె. చంద్రశేఖర్‌ రావు) మీద ఆరోపణలు ఎక్కువగా కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి. జస్టిస్‌ పీసీ.ఘోష్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం, మెడిగడ్డ బ్యారేజ్‌ మునిగిపోవడం, ఇతర రెండు బ్యారేజులకు నష్టం వాటా కేసీఆర్‌ ఒక్కరి బాధ్యత. నివేదికలో, నిపుణుల సలహాలను పట్టించుకోకపోవడం, స్వయం నిర్ణయాలు, మొత్తం రూ.లక్ష కోట్లు వృథా అయినట్లు తేలింది. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టినప్పటికీ, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు కేసీఆర్‌ లేదా హరీశ్‌రావు మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు రేవంత్‌ సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక పార్టీలో అంతర్గత సమస్యలు, కుటుంబంలో గొడవలు కేసీఆర్‌ను ఉర్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూతురు కవిత ఎపిసోడ్, కొడుకు కేటీఆర్‌పై ఈఫార్ములా రేసు కేసు.. తలనొప్పిగా మారాయి.

రేవంత్‌ దూకుడు..
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా 20 మంది నెలల్లో బీఆర్‌ఎస్‌ మీద దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలు కావడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక 15 నెలల్లో 1.53 లక్షల కోట్లు వడ్డీలు చెల్లించామని చెప్పారు. ఇది ప్రజల్లో ఒకవేళ బీఆర్‌ఎస్‌పై కోపాన్ని పెంచినా, రేవంత్‌ ప్రభుత్వంపై కూడా ప్రశ్నలు లేవని కాదు. యూరియా కరువు, అధిక వర్షాలు, రెడ్లు హెలికాప్టర్‌ షికార్లు వంటి సంఘటనలు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఖమ్మం పొద్దుతిరుగుడు రెడ్డి అక్రమార్జన వంటి ఆరోపణలు, రేవంత్‌ సొంత కుటుంబ సంబంధాల్లో రూ.2,200 కోట్ల కాంట్రాక్టులు (బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు ప్రకారం) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తుకు దారి తీస్తున్నాయి. బీఆర్‌ఎస్, రేవంత్‌ను ‘కాంగ్రెస్‌ ఏటీఎం‘గా అంటూ, రాజీనామా డిమాండ్‌ చేస్తోంది. ఇది రాజకీయ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తోంది. రేవంత్, కోడంగల్‌లో భూసేకరణలో బీఆర్‌ఎస్‌ అడ్డుకోవడాన్ని ఆరోపించింది. ఇలా, రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాయి. ప్రజల అభివృద్ధి ప్రాజెక్టులు (ఇరిగేషన్, ఉపాధి) ఆలస్యమవుతున్నాయి.

మీడియా డ్యూయల్‌ రోల్‌..
తెలంగాణలో మీడియా డ్యూయల్‌ రోల్‌ పోషిస్తోంది. ఒక వైపు, బీఆర్‌ఎస్‌కు సన్నిహిత మీడియా ‘జనం శిక్షించేశారు, కేసులు వద్దు‘ అని ప్రచారం చేస్తోంది. మరోవైపు, స్వతంత్ర ఆలోచనాపరులు కూడా ‘రేవంత్‌ పాలనపై దృష్టి పెట్టాలి, కక్షలు మానేయాలి‘ అని సలహా ఇస్తున్నారు. ఇది ఆశ్చర్యకరం, ఎందుకంటే జర్నలిస్టులు రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే, చట్ట ప్రయత్నాలను ప్రోత్సహించాలి. రేవంత్‌ మీద కూడా 2015 క్యాష్‌–ఫర్‌–వోట్‌ కేసు, ఫేక్‌ జర్నలిస్టులపై వ్యాఖ్యలు వంటివి ఉన్నాయి. మీడియా తటస్థంగా ఉంటే, అవినీతి దర్యాప్తులు పాలనకు అడ్డం కాకుండా, సమాంతరంగా సాగాలని చూపించాలి. లేకపోతే, పక్షపాత ఆరోపణలు పెరుగుతాయి.

ఎన్నికల్లో ఓటమి చట్ట శిక్షకు మినహాయింపు కాదు. ఇందిరాగాంధీ నుంచి చంద్రబాబు, జగన్‌ వరకు అరెస్టులు జరిగినా, అధికారంలోకి వచ్చారు – కానీ అది చట్టాన్ని బలహీనపరచడం కాదు. కేసీఆర్‌ మీద దర్యాప్తులు జరిగితే, రేవంత్‌ ప్రభుత్వానికి మరింత బలం వస్తుంది, ఎందుకంటే ప్రజలు అవినీతి శిక్షలు కోరుకుంటారు. అయితే, దీర్ఘకాలంలో ఈ కేసులు ఎన్నికల ఫలితాలను మార్చవచ్చు. ఒకవేళ రేవంత్‌ స్వంత అక్రమాలు తేలితే, కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతుంది. చట్ట భయం లేకపోతే, ప్రతి అధికార పార్టీ రూ.వేల కోట్లు దోచుకునే మార్గం సులభమవుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. పొరుగు దేశాల్లాగా తిరుగుబాట్లకు దారి తీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular