Bigg Boss 9 Telugu Disaster: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఫస్ట్ హాఫ్ అదిరింది..కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుండి పూర్తిగా మారిపోయింది. దివ్య ఎంట్రీ తర్వాత కాస్త మార్పులు వస్తే, 5వ వారం ఫైర్ స్ట్రోమ్ అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ కారణంగా షో మొత్తం పూర్తిగా గాడి తప్పింది. బయట ఏమి జరుగుతుందో తెలియనంత కాలం ఏ కంటెస్టెంట్ అయినా నిజాయితీగానే హౌస్ లో ప్రవర్తిస్తాడు. కానీ ఎప్పుడైతే అవసరానికి మించి బయట నుండి ఇన్ పుట్స్ వస్తాయో కంటెస్టెంట్స్ గేమ్ మొత్తం పూర్తిగా మారిపోతాది. ఈ సీజన్ లో అదే జరిగింది. గత సీజన్ లో ఫ్యామిలీ వీక్ నుండి ఇలాంటివి జరిగేవి, కానీ ఈ సీజన్ లో మాత్రం 5వ వారం నుండే అలాంటి స్థితికి వచ్చేసింది. గత సీజన్స్ లో బేధాలు చాలా వరకు నిజాయితీగా ఉండేవి.
కానీ ఈ సీజన్ లో మాత్రం కేవలం అవసరం కోసమే రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు తనూజ, ఇమ్మానుయేల్. బయట నుండే వీళ్ళు మంచి స్నేహితులు. హౌస్ లోకి వచ్చిన తర్వాత మూడు వారాల వరకు స్నేహితులు గానే ఉన్నారు. కానీ ఆ తర్వాత గొడవలు పడడం, గొడవపడిన మరుక్షణమే కలిసిపోవడం వంటివి చూస్తుంటే, ఇమ్మానుయేల్ కి కామెడీ స్కిట్స్ కోసం తనూజ తో పనిగట్టుకొని బాండింగ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. నిన్న నామినేషన్స్ లో ఏ రేంజ్ లో వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగాయో మనమంతా చూసాము, కానీ రాత్రి వీళ్లిద్దరు అమంసు విప్పుకొని స్నేహితులు అయిపోవడం చూస్తే, తనూజ కి ఇమ్మానుయేల్ అంటే భయం వేసింది అనే అనిపించింది. నామినేషన్స్ తనపై గన్ షాట్ పాయింట్స్ పెట్టాడు, మళ్లీ అలాంటి పాయింట్స్ పెడితే నా గేమ్ ప్లాన్ మొత్తం ఎక్స్ పోజ్ అయిపోతుంది అనే భయం తోనే ఆమె ఇమ్మానుయేల్ తో స్నేహం చేసినట్టుగా అందరికీ అనిపించింది.
ఇక భరణి విషయానికి వస్తే తనూజ ఇన్ని రోజులు ఆయన ఫేక్ రిలేషన్ ని మైంటైన్ చేసినట్టు అనిపించింది. కారణం ఒక్క వారం కెప్టెన్సీ టాస్క్ లో సపోర్టు చేయలేదని భరణి పై విపరీతమైన కోపం తెచ్చుకొని, అతన్ని నామినేట్ చేయడమే కాకుండా భరణి గారూ అని సంబోధించడం అందరినీ షాక్ కి గురి చేసింది. నాన్న నాన్న అంటూ ఇన్ని రోజులు తిరిగిన అమ్మాయి, ఇప్పుడు ఒక్కసారిగా భరణి గారు అని పిలవడం ఏంటి?, అంటే ఇన్ని రోజులు వీళ్ళ రిలేషన్ ని నిజమని నమ్మిన వాళ్లంతా మోసపోయారా అనిపించింది. ప్రస్తుతానికి హౌస్ లో డిమోన్ పవన్, రీతూ రిలేషన్ తప్ప మిగిలిన వాళ్లందరిదీ ఫేక్ బాండింగ్ అని అనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే ఈ సీజన్ ఆరవ సీజన్ కంటే పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది.