CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరిగే ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల నాయకులు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.. గులాబీ పార్టీ తరఫున కేటీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన హైడ్రా అనే వ్యవస్థ మీద కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైడ్రా వల్ల పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇటీవల కేటీఆర్ వివరించారు.. హైడ్రా కూల్చివేతల వల్ల రోడ్డు మీద పడిన బాధితులతో కేటీఆర్ మాట్లాడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్లో బాధితులు పడుతున్న ఇబ్బందులను వారి నోటితోనే చెప్పించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు రెఫరండంగా గులాబీ పార్టీ చెబుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైతే తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లిపోయినట్టేనని చెబుతోంది. గులాబీ పార్టీ ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు కేటీఆర్ మాటలకు గట్టి కౌంటర్లు ఇస్తోంది.. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్న నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి. పైగా నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించడానికి అజహరుద్దీన్ ను సైతం పక్కన పెట్టాడు రేవంత్ రెడ్డి. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి.. ఏకంగా మంత్రి పదవి ఇచ్చాడు.. దీనిని బట్టి ఈ నియోజకవర్గం మీద రేవంత్ ఏ స్థాయిలో ఫోకస్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో గనుక విజయం సాధిస్తాయి హైదరాబాద్ నగర పరిధిలో రెండవ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది.. పైగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం చేకూర్చుతుంది. అందువల్ల రేవంత్ ఈ నియోజకవర్గం మీద విపరీతంగా ఫోకస్ పెట్టాడు.
తానే స్వయంగా ప్రచారం చేయడంతో పాటు.. మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు రేవంత్ టార్గెట్ విధించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యేను నియమించారు. 8 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతను ఒక మంత్రిగా పగించారు. డివిజన్లవారీగా నేతలు పనిచేస్తున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా కీలకమైన నేతలకు అప్పగించారు. రోజుకు 250 ఇళ్లు లక్ష్యంగా ప్రచారం చేయాలని టార్గెట్ పెట్టారు. ప్రతి రాష్ట్ర నాయకుడు 30 మందితో కలిసి ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని టార్గెట్ పెట్టారు. నాయకులను ఎప్పటికప్పుడు కీలక నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుండి సాగాలని సూచించారు. ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.. నియోజకవర్గానికి ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు ఎప్పటికప్పుడు తన పని తీరును అంచనా వేసుకుంటూ.. మరింత మెరుగ్గా ముందడుగు వేయాలని సూచించారు.. నామినేటెడ్ పదవులు పొందిన వారంతా కూడా నిత్యం ప్రజల మధ్య ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి విధించిన నిబంధన నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.